నైటీ వెస్కొని మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? కమెడియన్‌ని నిలదీసిన నటి!
త్రివిక్రమ్ తెరకెక్కించిన `ఆదర్శ కుటుంబం- హౌస్ నం.ఏకే 47` సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ చిట్‌చాట్ ప్రస్తుతం సినీ ప్రియుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 3 Oct 2026 9:38 AM ISTత్రివిక్రమ్ తెరకెక్కించిన `ఆదర్శ కుటుంబం- హౌస్ నం.ఏకే 47` సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ చిట్‌చాట్ ప్రస్తుతం సినీ ప్రియుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రమోషనల్ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తారాగణం మధ్య జరిగిన సరదా సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేష్ హీరోగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. అక్టోబర్ 9న ఈ సినిమా విడుదల కానుండగా చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
ఈ చిట్‌చాట్ సెషన్‌లో భాగంగా కమెడియన్ సత్య నైటీ వేసుకుని చేసిన హంగామా గురించి ఫన్ చర్చ నడిచింది. ``మీరు నైటీ వేసుకొని మా ఇంటికి ఎందుకు వస్తున్నారు?`` అంటూ హీరోయిన్ శ్రీనిధి శెట్టి సత్యను సరదాగా నిలదీశారు. దీనికి తోడు వెంకటేష్ స్పందిస్తూ.. అసలు ఆ నైటీ నీకు ఎలా దొరికింది? అంటూ ఆటపట్టించగా ఈ సరదా మూమెంట్ మరింత పీక్స్‌కు వెళ్లింది.
ఈ సరదా సంభాషణల మధ్యలో యాంకర్ స్పందిస్తూ.. డబుల్ ఎక్స్ సైజ్ ఉండే సత్యకు ఎం (M) సైజ్ నైటీ ఎలా ఫిట్ అయింది? అని ప్రశ్నించారు. దీనికి సత్య బదులిస్తూ.. తాను చూడటానికి అలా ఉంటానని.. కానీ తాను మాత్రం `ఎం సైజ్`లో స్లిమ్ గా ఉంటానని తనదైన శైలిలో కౌంటర్లు వేసి అందరినీ నవ్వించారు.
`ఆదర్శ కుటుంబం` చిత్రంలో కమెడియన్ సత్య పాత్ర .. అతడు చేసే హంగామా మామూలుగా ఉండదని దీనిని బట్టి స్పష్టమవుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, భావోద్వేగాలను పీక్స్‌లో పండించడానికి సత్యకు ఈ చిత్రంలో మరో చక్కటి అవకాశం లభించింది. ఇప్పటికే టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా దూసుకుపోతున్న సత్యను వెంకీ మామ టీమ్ సరదాగా ఆటపట్టించడం విశేషం.
ప్రస్తుతం కమెడియన్ సత్య `ఆదర్శ కుటుంబం` చిత్రంతో పాటుగా, 2026 సంవత్సరంలో రానున్న భారీ క్రేజీ చిత్రాలు `స్వయంభు`, `వృషకర్మ` సహా మరో అరడజను క్రేజీ ప్రాజెక్ట్‌లలో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సత్య తన కామెడీ టైమింగ్‌తో ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నారు.
