90స్ ఫేవరెట్ క్రషెస్.. మళ్లీ సందడి చేసేందుకు రెడీ!
90స్ జెనరేషన్ మూవీ లవర్స్ కు ఒకప్పుడు క్రషెస్ గా మారిన పలువురు హీరోయిన్లు మళ్లీ సందడి చేసేందుకు రెడీ అవుతుండడం ఆసక్తికరంగా మారింది.
By: M Prashanth | 21 March 2026 5:00 AM IST90స్ జెనరేషన్ మూవీ లవర్స్ కు ఒకప్పుడు క్రషెస్ గా మారిన పలువురు హీరోయిన్లు మళ్లీ సందడి చేసేందుకు రెడీ అవుతుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సోనాలీ బింద్రే, జ్యోతిక వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో 90స్ సినీ ప్రియులంతా మళ్లీ తమ క్రషెస్ ను వరుస ప్రాజెక్టుల్లో చూసేందుకు రెడీ అయిపోతున్నారు!
అయితే 2000 ప్రారంభంలో నార్త్, సౌత్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన సోనాలి బింద్రే, జ్యోతిక తమ అందం, నటనతో యూత్ ను ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో వీరు సినిమాలకు దూరమయ్యారు. ఆ టైమ్ లో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ కొనసాగించడం చాలా అరుదు. అందువల్ల ఫ్యాన్స్ అభిమానులు మళ్లీ వాళ్లను తెరపై చూడాలని ఆశించినా, అది సాధ్యమవుతుందో లేదో అనేది అనుమానంగా ఉండేది.
ఇక ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో వయస్సు, ఇమేజ్ వంటి పరిమితులు తగ్గిపోయాయి. కథకు ఇంపార్టెన్స్ పెరగడంతో టాలెంట్ ఉన్న హీరోయిన్లకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జ్యోతిక ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె సిస్టమ్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ డెబ్యూ ఇవ్వనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు..
అలాగే సోనాలి బింద్రే కూడా రాఖ్ అనే ప్రాజెక్ట్ తో ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆరోగ్య సమస్యలు జయించి తిరిగి కెమెరా ముందుకు రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోనాలి గతంలో చేసిన సినిమాలు, అందమైన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచే ఉన్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో శ్రియా శరన్, ఆలియా భట్ వంటి హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.
ఆ ఛేంజ్ ఇప్పుడు హీరోయిన్లకు మాత్రమే కాకుండా, గతంలో రాణించిన హీరోయిన్స్ కు కూడా అవకాశాలను తీసుకువచ్చింది. అందుకే ఇప్పుడు సోనాలి, జ్యోతిక లాంటి స్టార్ బ్యూటీలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సినిమా రంగంలో వచ్చిన ఆ మార్పు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఒకప్పుడు తమ ఫేవరెట్ హీరోయిన్లను మళ్లీ తెరపై చూడడం 90స్ జనరేషన్ ప్రేక్షకులకు నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగిస్తోంది.
అదే సమయంలో కొత్త జనరేషన్ కు వారి యాక్టింగ్ ను ఆస్వాదించే ఛాన్స్ వస్తుంది. మొత్తానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల సినీ ఇండస్ట్రీలో కొత్త దారులు తెరుచుకున్నాయి. ఒకప్పుడు స్టార్ డమ్ ను ఆస్వాదించిన సీనియర్ బ్యూటీలు మళ్లీ తమ టాలెంట్ ను చూపించే అవకాశం పొందుతున్నారు. త్వరలో మరింత మంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే చెప్పాలి.
