87 ఏళ్ల వయసులో తండ్రైన ప్రముఖ చిత్రకారుడు.. విషయం ఏంటంటే!
సాధారణంగా ఏ వ్యక్తి అయినా.. తండ్రి అయ్యేందుకు నిర్దేశిత వయసు ఉంటుంది. భారత్‌లో ఈ వయసు 60 ఏళ్ల వరకు ఉంది.
By: Garuda Media | 18 Dec 2025 4:00 AM ISTసాధారణంగా ఏ వ్యక్తి అయినా.. తండ్రి అయ్యేందుకు నిర్దేశిత వయసు ఉంటుంది. భారత్‌లో ఈ వయసు 60 ఏళ్ల వరకు ఉంది. చైనా, జపాన్ తదితర దేశాల్లో సంతానోత్పత్తి వయసు .. 50 ఏళ్లకు మించడం లేదు. దీంతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం.. సంతానోత్పత్తి కణాల పెంపుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.చిత్రంగా 87 ఏళ్ల వయసులో చైనాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫ్యాన్ జెంగ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య జు మెంగ్ వయసు 37 సంవత్సరాలు. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం గమనార్హం. కొన్నేళ్ల కిందటే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరికి ఓ బాబు జన్మించాడు.
విషయం ఏంటంటే..
87 ఏళ్ల ఫ్యాన్ జెంగ్‌కు ఇదివరకే వివాహం అయింది. అయితే..తొలివివాహానికి కుమార్తె మాత్రమే పుట్టింది. దీంతో ఆయన ఓ కుమారుడిని దత్తత తీసుకున్నారు. అనంతర కాలంలో ఆయనకు జు మెంగ్ పరిచయం అయ్యారు. అప్పటికే ఆయన వయసు 80 ఏళ్లు దాటినా.. అయితే.. తలపులు మాత్రం తరగని నేపథ్యంలో ఇరువురు కలిశారు. ఒక్కటయ్యారు. తాజాగా ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. ఇది జరిగిన తర్వాత.. అనూహ్యంగా ఫ్యాన్ జెంగ్‌కీలక ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై.. తన కుమార్తెతోనూ.. దత్తత తీసుకున్న కుమారుడితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
అంతేకాదు.. తన పేరు, ఊరు,ఆస్తి అన్నీ ఇప్పుడు పుట్టిన పిల్లాడికే చెందుతాయని కూడా వీలునామా రాసేశారు. న్యాయపరమైన చర్యలు కూడా సిద్ధ చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చట్టబద్ధమైన వారసుడిగా ఉన్న దత్తు కుమారుడు, కడుపున పుట్టిన కుమార్తెలు విస్మయం వ్యక్తం చేశారు. అయితే.. తన తండ్రిది స్వార్జితం కావడంతోపాటు .. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న పేరు నేపథ్యంలో ఇరువురు బిడ్డలు మౌనంగా ఉన్నారు. కాగా.. 37 ఏళ్ల జు మెంగ్ కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. కానీ, ప్రేమలో పడి.. తాత లాంటి వ్యక్తిని వివాహం చేసుకున్నా.. ఆమె హ్యాపీగానే ఉన్నారు.
ఎవరీ ఫ్యాన్ జంగ్
ఫ్యాన్ జంగ్ అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఆయన గీసిన వర్ణ చిత్రాలు, తైల చిత్రాలకు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. వందల కోట్ల రూపాయల ఆస్తులను ఆయన చిత్రాల ద్వారానే సంపాయించారు. అంతేకాదు కాలీ గ్రాఫ్‌లోనూ ఆయనది అందెవేసిన చేయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ తైల వర్ణ చిత్రకారుడిగా ఫ్యాన్ పేరు ఇప్పటికీ మార్మోగుతుంది. మనకు `బాపు` మాదిరిగా అన్నమాట. అత్యంత ఆడంబరమైన జీవితాన్ని గడిపే ఫ్యాన్ జంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు కూడా ఉన్నారు.
