ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ హైలెట్స్ వీడియో చూశారా..?
లేటెస్ట్ గా ఈ ఎయిటీస్ స్టార్ రీయూనియన్ ప్రోగ్రాం జరిగింది. అసలేమాత్రం హడావిడి లేకుండా జరిగే ఈ కార్యక్రమం లో యూనిక్ ఐడియాస్ తో వాళ్లు వెళ్తుంటారు.
By: Ramesh Boddu | 7 Oct 2025 3:29 PM ISTసినీ ప్రపంచంలో ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒక అలవాటు ఉంటుంది. అందులోనూ ఒకప్పటి స్టార్స్ కి కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. అలా వారంతా కలిసినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఎయిటీస్ స్టార్స్ అంతా కూడా కలిసి ఒక ఈవెంట్ జరుపుకుంటారు. ఇదో రకంగా క్రేజీ గెట్ టు గెదర్ గా మారింది. ఎయిటీస్ స్టార్స్ అంతా భాషతో సంబంధం లేకుండా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునే ఈ ఈవెంట్ ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
ఎయిటీస్ స్టార్ రీయూనియన్ జంగిల్ థీమ్ తో ..
లేటెస్ట్ గా ఈ ఎయిటీస్ స్టార్ రీయూనియన్ ప్రోగ్రాం జరిగింది. అసలేమాత్రం హడావిడి లేకుండా జరిగే ఈ కార్యక్రమం లో యూనిక్ ఐడియాస్ తో వాళ్లు వెళ్తుంటారు. ఈసారి ఎయిటీస్ స్టార్స్ అంతా కూడా డిఫరెంట్ గా జంగిల్ థీమ్ తో కనిపించారు. అంటే అడవిలో ఉండే యానిమల్ టైప్ కాస్టూమ్స్ తో డిఫరెంట్ ప్లానింగ్ తో వచ్చారు. ఇదంతా ప్రోగ్రాం ని ఆర్గనైజ్ చేసే వాళ్లు ముందే ఆ స్టార్స్ కి చెప్పి ఉండొచ్చు.
కలవడమే కాదు దానికి ఒక సెపరేట్ థీమ్ ని పెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తెలుగు స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో పాటు సీనియర్ యాక్టర్ నరేష్, సురేష్ కూడా ఈ ఎయిటీస్ రీయూనియన్ లో పాల్గొన్నారు. ఐతే ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ కాగా దీనికి సంబందించిన హైలెట్స్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
నాలుగైదు దశాబ్దాలుగా తమ నటనతో..
ఎయిటీస్ స్టార్స్ అంటే ఇప్పటికే నాలుగైదు దశాబ్దాలుగా తమ నటనతో ప్రేక్షకులకు అలరిస్తూ వచ్చిన వాళ్లు వీరంతా.. ఇప్పటికీ వీరిలో చాలామంది తెర మీద తమ అభినయంతో మెప్పిస్తున్నారు. తెలుగు స్టార్స్ మాత్రమే కాదు ఎయిటీస్ స్టార్స్ లో బాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ స్టార్స్ కూడా పాల్గొని ప్రోగ్రాం ని సూపర్ సక్సెస్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మరింత జోష్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ ఎయిటీస్ స్టార్ రీయూనియన్ లో అప్పటి తారలంతా ఎంతో చలాకీగా డాన్సులు, పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఎయిటీ స్టార్స్ రీయూనియన్ వీడియో కూడా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. వీరి పార్టీలో ఆ స్పెషల్ థీం గురించి ప్రత్యేక డిస్కస్ చేస్తున్నారు.
