నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్.. ఎవరెవరిని వరించాయంటే?
కేంద్ర ప్రభుత్వం తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అనౌన్స్ చేసింది. ముందుగా చెప్పినట్లు.. శుక్రవారం సాయంత్రం అవార్డులు క్యాటగిరీ వైజ్ గా ప్రకటించింది.
By: M Prashanth | 1 Aug 2025 11:55 PM ISTకేంద్ర ప్రభుత్వం తాజాగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అనౌన్స్ చేసింది. ముందుగా చెప్పినట్లు.. శుక్రవారం సాయంత్రం అవార్డులు క్యాటగిరీ వైజ్ గా ప్రకటించింది. తొలుత నాన్ ఫీచర్ ఫిల్మ్స్ క్యాటగిరీలో అవార్డులను వెల్లడించిన జ్యూరీ హెడ్, నిర్మాత అశుతోష్.. ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పురస్కారాలను వెల్లడించారు.
2023కి గాను అవార్డులను కేంద్రం ప్రకటించగా.. జాతీయ ఉత్తమ సినిమాగా బ్లాక్ బస్టర్ చిత్రం 12th ఫెయిల్ కు పురస్కారం దక్కింది. బెస్ట్ హీరోగా జవాన్ కు గాను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ కు గాను విక్రాంత్ మెస్సే సెలెక్ట్ అయ్యారు. వీరిద్దరూ.. ఉత్తమ నటుడి అవార్డు పంచుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ మూవీకి గాను ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ అవార్డు అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ గా ది కేరళ స్టోరీ రూపొందించిన సుదీప్తో సేన్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా నేపథ్య సంగీతానికి గాను హర్షవర్థన్ రామేశ్వర్ దక్కించుకున్నారు. సూపర్ హిట్ మూవీ యానిమల్ హిందీ వెర్షన్ కు గాను సాధించారు.
ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మిగతా అవార్డులు ఇవే!
బెస్ట్ సహాయ నటుడు : పూక్కాలం (మాలీవుడ్) విజయ రాఘవన్, పార్కింగ్ (కోలీవుడ్) ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్
బెస్ట్ సహాయ నటి: ఉళ్ళోలుక్కు (మాలీవుడ్) ఊర్వశి, వష్ (గుజరాతీ) జానకీ బోడివాలా
ఉత్తమ బాల నటి : గాంధీతాత చెట్టు (టాలీవుడ్) సుకృతివేణి, జిప్సీ (మరాఠీ) కబీర్ ఖండారీ, నాల్ 2 (మరాఠీ) త్రిష థోసర్
ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): పార్కింగ్ (కోలీవుడ్) రామ్‌కుమార్ బాలకృష్ణన్, బేబీ (టాలీవుడ్) సాయి రాజేష్
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సింగర్ మేల్: బేబీ (ప్రేమిస్తున్నా..) పీవీఎన్ ఎస్ రోహిత్
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సింగర్ ఫిమేల్: జవాన్ (చెలియా) శిల్పారావు
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (బాలీవుడ్ వెర్షన్) వసంతను మొహపాత్రో
ఉత్తమ డైలాగ్స్: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (బాలీవుడ్) దీపక్ కింగ్రానీ
ఉత్తమ ఎడిటింగ్: పూక్కాలమ్ (మాలీవుడ్) మిధున్ మురళి
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: 2018 (మాలీవుడ్) మోహన్‌దాస్
బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ: రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ (బాలీవుడ్) వైభవ్ మర్చంట్
ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (బాలీవుడ్)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు: ఆత్మపాంప్లెట్ (మరాఠీ) ఆశిష్ బెండే
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలుగా అవార్డులు సాధించినవి ఇవే.
ఉత్తమ తెలుగు మూవీ: భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ సినిమా: పార్కింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: గాడ్ డే గాడ్ డే చా
ఉత్తమ ఒడియా ఫిల్మ్: పుష్కర
ఉత్తమ గుజరాతీ చిత్రం: వష్
ఉత్తమ మరాఠీ సినిమా: షామ్‌చియాయ్
ఉత్తమ మలయాళీ మూవీ: ఉళ్ళోలుక్కు
ఉత్తమ హిందీ సినిమా: కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
ఉత్తమ బెంగాలీ మూవీ: డీప్ ఫ్రిడ్జ్
ఉత్తమ అస్సామీ సినిమా: రొంగటపు 1982
ఉత్తమ కన్నడ ఫిల్మ్: కందీలు -ది రే ఆఫ్ హోప్
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ క్యాటగిరీలో అవార్డులు ఇవే!
ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (శాండల్ వుడ్)
ఉత్తమ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (హాలీవుడ్)
ఉత్తమ సంగీత దర్శకత్వం : ది ఫస్ట్ ఫిల్మ్ (బాలీవుడ్)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (హాలీవుడ్)
ఉత్తమ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (బాలీవుడ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (కోలీవుడ్)
ఉత్తమ దర్శకత్వం: ది ఫస్ట్ ఫిల్మ్ (బాలీవుడ్)
బెస్ట్ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్ లెస్ తమిళనాడు (హాలీవుడ్)
