ఆకాశంలో కొత్త సినీ వ్యాపారం.. విమాన సినిమాలకూ ఆస్కార్!
2025లో ప్రపంచవ్యాప్తంగా 498 కోట్ల సినిమా టికెట్లు అమ్ముడవగా, దాదాపు 497 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో విమానాల్లో సినిమా ప్రదర్శన కీలక వాణిజ్య రంగంగా మారుతోంది. ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ 2015లో 2.85 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది 9.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కామెడీ, రొమాంటిక్ చిత్రాలకు విమానాల్లో ఎక్కువ ఆదరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
By: Srikanth Kontham | 23 Nov 2026 8:00 AM ISTప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అమ్ముడైన సినిమా టికెట్ల సంఖ్యకు దాదాపు సమానంగా విమాన ప్రయాణికులు ప్రయాణించడం తాజాగా సినీ వ్యాపార లెక్కలనే మార్చేస్తోంది. 2025లో 498 కోట్ల సినిమా టికెట్లు అమ్ముడుపోగా.. దాదాపు 497 కోట్ల మంది విమాన ప్రయాణికులు గగనవిహారం చేశారన్న గణాంకాలు ఆకాశంలోని ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ఎంత బలంగా మారిందో స్పష్టం చేస్తున్నాయి. దీంతో హాలీవుడ్ స్టూడియోలు.. ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ను ఓ కీలక వాణిజ్య వేదికగా హైలైట్ అవుతుంది.
1993లో టెర్రీ స్టైనర్ ఇంటర్నేషనల్‌ను ప్రారంభించినా? అప్పట్లో క్యాబిన్ ముందుభాగంలోని స్క్రీన్లపై పరిమిత సినిమాలు మాత్రమే చూపించేవారని సంస్థ అధ్యక్షురాలు టెర్రీ స్టైనర్ గుర్తుచేసుకున్నారు. కాలక్రమేణా సాంకేతికత మారడంతో ప్రతి సీటు వెనుక స్క్రీన్లు.. వ్యక్తిగత మెనూలు వచ్చి విమాన ప్రయాణంలో సినిమా చూడటం అల వాటుగా మారింది. కొందరు పాత కంఫర్ట్ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తుంటే మరికొందరు థియేటర్లలో మిస్సైన కొత్త చిత్రాలను ఆకాశంలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.
మార్కెట్స్ నివేదిక ప్రకారం ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్.. కనెక్టివిటీ రంగం 2015లో 2.85 బిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది అంచనా ప్రకారం 9.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విమానాల్లో వైర్లెస్ టెక్నాలజీ.. ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చినా? థియేటర్ల మాదిరిగానే ఇది స్ట్రీమింగ్కు పోటీ కాదని స్టైనర్ తేల్చిచెప్పారు. ఓటీటీలో వెంటనే దొరకని కొత్త రిలీజ్లు.. ప్రత్యేకమైన కంటెంట్ విమానాల్లో లభిస్తుండటంతో మార్కెట్ దీర్ఘకాలం నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
విమానంలో ఏ సినిమా బాగుంటుందన్నదానిపై కొన్ని స్పష్టమైన లెక్కలుంటాయి. హారర్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువ మంది ఇష్టపడరని.. ముఖ్యంగా విమాన ప్రమాదాలకు సంబంధించిన సన్నివేశాలు ఏమాత్రం సరిపడవని స్టైనర్ నవ్వుతూ చెప్పారు. కామెడీ.. రొమాంటిక్ కామెడీ.. బ్లాక్బస్టర్లతో పాటు చిన్న ఆర్ట్ సినిమాలు కూడా కొన్ని ఎయిర్‌లైన్స్‌లో అనూహ్యంగా ఆదరణ పొందుతాయని.. కానీ కొన్ని భారీ హిట్ చిత్రాలు హింస .. సున్నిత అంశాల వల్ల విమాన ప్రదర్శనలకు అనువుగా ఉండవని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎయిర్‌ప్లేన్ సినిమాలు ప్రత్యేక సంస్కృతిగా మారాయి. దీర్ఘ ప్రయాణాల్లో పాత క్లాసిక్ చిత్రాలు చూడాలని కోరుకునేవారికి ఇదొక చక్కటి అవకాశంగా మారింది. దాదాపు వంద ఎయిర్‌లైన్స్‌తో పాటు ఆసుపత్రులు.. క్రూయిజ్ షిప్‌లు.. యూనివర్సిటీల వంటి రంగాలకు కంటెంట్ అందిస్తున్న స్టైనర్ ఇటీవల లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. భవిష్యతమ్ లో విమాన సినిమాలకు కూడా ఆస్కార్‌లో ప్రత్యేక విభాగం వస్తే బాగుంటుందన్న మాట ఆకాశంలో సినిమా వ్యాపారం ఎంత ఎత్తుకు ఎదిగిందో చెప్పకనే చెబుతుంది.
