Begin typing your search above and press return to search.

లోపలికి వెళ్తే బతికి బయటకు రారా? ట్రైలర్‌ తోనే 418 భయపెట్టేలా..

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.

By:  M Prashanth   |   11 Sept 2026 6:11 PM IST
లోపలికి వెళ్తే బతికి బయటకు రారా? ట్రైలర్‌ తోనే 418 భయపెట్టేలా..
X

హారర్ సినిమా అంటే భయపెట్టే సీన్లు మాత్రమే కాదు.. ఆ భయం తర్వాత ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు 418 మూవీ ట్రైలర్ చూస్తే అదే ఫీల్ కనిపిస్తోంది. ఓ ఇల్లు.. అందులో ఎవరికీ అంతుచిక్కని రూమ్ నంబర్ 418.. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ల చుట్టూ జరిగే వింత సంఘటనలు.. వీటన్నింటినీ కలిపి 418ను సీరియస్ హారర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చెబుతోంది.




స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మొదటి నుంచే ఓ రహస్యమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఓ ఇంటి గురించి వాచ్‌ మన్ చెప్పే మాటలతో ఆసక్తి మొదలవుతుంది.

15 ఏళ్లుగా మూసి ఉన్న ఆ ఇల్లు.. అందులోని 418వ గది.. ఆ రూమ్‌ కు ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ట్రైలర్ చూస్తున్న కొద్దీ పెరుగుతాయి. 18 ఏళ్ల వివేక్ చుట్టూ కథ నడుస్తున్నట్లు ట్రైలర్‌ లో చూపించారు. అతను చూస్తున్నది నిజమా? భ్రమా? అనే డౌట్ కలిగేలా కొన్ని సీన్స్ చూపించారు. మరోవైపు ప్రెగ్నెంట్ దేవిక ఆ ఇంట్లోకి రావడంతో అసలు మిస్టరీ ముదురుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ సినిమా ఏ రేంజ్ లో భయపెట్టబోతుందో చూపించేలా ఉన్నాయి.

ముఖ్యంగా ట్రైలర్ లో హారర్ డోస్ ఒక్కసారిగా పెరిగింది. చీకటి గదులు, వింత శబ్దాలు, భయపెట్టే విజువల్స్‌ తో పాటు కొన్ని సీన్స్ దర్శకుడు చూపించారు. అయితే కేవలం జంప్ స్కేర్స్‌ పై ఆధారపడకుండా.. కథలోని మిస్టరీని నెమ్మదిగా పెంచుతూ భయాన్ని క్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక చైత్ర ఆచార్ రోల్ ట్రైలర్‌ లో స్పెషల్ గా నిలిచింది. ఆమె లుక్, ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ భయాన్ని మరింత పెంచాయి. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల పాత్రలను ట్రైలర్‌ లో ఇంట్రెస్టింగ్ గా పరిచయం ఇచ్చారు.

ఆ రోల్స్ అన్నింటికి 418 రూమ్ మిస్టరీతో ఏదో ఒక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు కెమెరా వర్క్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ మెయిన్ స్త్రెంగ్త్స్ కానున్నాయి. డినేష్ దివాకర్ కెమెరా వర్క్ స్కేరీ ఎన్విరాన్మెంట్ ను మరింత స్ట్రాంగ్ గా చూపిస్తే.. వెంకీ జీజీ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ లో ఏదో జరగబోతోందనే ఫీల్ ఇచ్చింది.

ఓవరాల్ గా 418 ట్రైలర్ కథ పూర్తిగా చెప్పకుండా.. అసలు మిస్టరీ ఏంటనే ప్రశ్నను ప్రేక్షకుల్లో రేపింది. ముఖ్యంగా సీరియస్, ఇంటెన్స్ హారర్‌ ను కోరుకునే వారికి సినిమా నచ్చేలా ఉంది. మరి 418వ గదిలో అసలు ఏం జరుగుతుంది? ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లకు ఏం అవుతుంది? తెలియాలంటే సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.