Begin typing your search above and press return to search.

418 మిస్టరీ.. ఇంకాస్త డోస్ పెంచిన మైత్రి

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త తరహా హారర్, మిస్టరీ థ్రిల్లర్ల ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ కథలకు భిన్నంగా కాస్త భయపెట్టే, మైండ్ బ్లాక్ చేసే కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.

By:  M Prashanth   |   19 Oct 2026 10:32 PM IST
418 మిస్టరీ.. ఇంకాస్త డోస్ పెంచిన మైత్రి
X

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త తరహా హారర్, మిస్టరీ థ్రిల్లర్ల ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ కథలకు భిన్నంగా కాస్త భయపెట్టే, మైండ్ బ్లాక్ చేసే కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. సరిగ్గా ఇదే బాటలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న సినిమా '418'. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత వారంలోనే రిలీజ్ అవ్వాలి. కానీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి ఈ వారం రిలీజ్ చేయనున్నారు.





ది నైట్ మేర్ బిగిన్స్.. అంటూ మరో వీడియో వదిలారు. ఈసారి అసలు కథను ఇంకాస్త రివిల్ చేశారు. ఈ సినిమా కథంతా ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 15 ఏళ్లుగా మూసి ఉన్న '418' నంబర్ గది చుట్టూ ఒక పెద్ద రహస్యం దాగుంటుంది. ఆ రూమ్ లో అసలు ఏం జరిగిందనే మిస్టరీని చేధించడానికి ప్రయత్నించే విద్యార్థులకు ఎలాంటి విచిత్రమైన, భయానక సంఘటనలు ఎదురయ్యాయనేదే అసలు కథ.

దెయ్యాలు, మూఢనమ్మకాలు, సైన్స్ మధ్య జరిగే సంఘర్షణను చాలా ఇంటెన్స్ గా ఇందులో చూపించబోతిన్నట్లు విజువల్స్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. వెంకీ జీజీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ ఈ హారర్ జానర్ కు తగ్గ మూడ్ ను పర్ఫెక్ట్ గా క్రియేట్ చేశాయి. చైత్ర జె. ఆచార్, రమేష్ ఇందిరా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు లాంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ది నైట్ మేర్ బిగిన్స్ లో చూపించిన విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ చూస్తుంటే థియేటర్లలో ఆడియన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ అనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు మరో పెద్ద బలం ప్రశాంత్ నీల్ బ్రాండ్. ఆయన ఈ చిత్రానికి దర్శకుడు కాకపోయినా, సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో సినిమాపై అంచనాలు వేరే లెవెల్ కు వెళ్ళాయి. మైత్రీ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ హారర్ థ్రిల్లర్ ను నిర్మించారు.

అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 23 న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు మారినప్పటికీ, ఈసారి పక్కా డేట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మెడికల్ కాలేజీ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ డిఫరెంట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భయానక వాతావరణం సృష్టిస్తుందో చూడాలి.