మాస్ డార్క్ థీమ్ నుండీ హార్రర్ డార్క్ తో ప్రశాంత్ నీల్ మెప్పిస్తారా?
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్‌ను దక్కించుకుంది.
By: Madhu Reddy | 10 Sept 2026 1:11 PM ISTఇండియన్ బాక్సాఫీస్ వద్ద కెజియఫ్, సలార్ చిత్రాలతో మాస్ డార్క్ థీమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ '418'. కెజియఫ్ వర్క్ చేసిన కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా, రొటీన్ కామెడీ హార్రర్లకు భిన్నంగా మైండ్ గేమ్‌తో భయపెట్టే ప్యూర్ డార్క్ హార్రర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సెప్టెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు చూద్దాం..
నో కామెడీ.. ప్యూర్ హార్రర్ థ్రిల్;
ఈ రోజుల్లో వస్తున్న చాలా హార్రర్ సినిమాలు భయపెడుతూనే మధ్యలో కామెడీని నమ్ముకుంటున్నాయి. కానీ '418' సినిమా మాత్రం ఎలాంటి కామెడీ హంగులు లేకుండా ప్యూర్ అండ్ ఇంటెన్స్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందింది. ప్రేక్షకులను నవ్వించడం పక్కన పెట్టి, కేవలం సైకలాజికల్ టెన్షన్, మిస్టరీ మరియు భయంతో మాత్రమే గూస్‌బంప్స్ తెప్పించేలా కథను డిజైన్ చేశారు. ఇక “హార్రర్ సినిమాలను చూసి నవ్వింది చాలు.. ఇప్పుడు నిజంగా భయపడాల్సిన సమయం వచ్చింది” అంటూ మేకర్స్ ఇచ్చిన కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్ ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.
'A' సర్టిఫికేట్‌తో థియేటర్లలోకి రచ్చ:
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్‌ను దక్కించుకుంది. సినిమాలో ఉన్న మైండ్ బ్లాకింగ్ హార్రర్ ఎలిమెంట్స్, భయపెట్టే సీన్స్ వల్లే దీనికి 'A' సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు మరియు ప్రీతి పగడాల ముఖ్య పాత్రల్లో నటించారు.
భయపెడుతున్న రిలీజ్ డేట్ పోస్టర్:
తాజాగా విడుదల చేసిన విడుదల తేదీ పోస్టర్ సినిమాలోని డార్క్ అట్మాస్ఫియర్‌ను పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసింది. చీకటి గదిలో నేలపై ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఉండటం, రక్తం మరకలతో ఇంగ్లీష్ అక్షరం 'A' రూపుదిద్దుకోవడం, దానికి చేరువగా ఒక చెయ్యి చాచి ఉండటం వంటి విజువల్స్ చాలా హారర్‌గా డిజైన్ చేశారు. ఇక దినేష్ దివాకర్ ఫోటోగ్రఫీ, వెంకీ జిజి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ హార్రర్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి.
బాక్సాఫీస్ వద్ద మరో డిఫరెంట్ అటెంప్ట్
ఇప్పటికే 'ఇరుముడి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్, ఈసారి ప్రశాంత్ నీల్ సపోర్ట్‌తో టాలీవుడ్‌లో ఒక కొత్త తరహా డార్క్ హార్రర్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేయబోతున్నారు. ఇక సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న '418' చిత్రం హార్రర్ మూవీ లవర్స్‌ను ఎంతవరకు మెప్పిస్తుందో, ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న ఈ ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..
