Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నిర్మాత 3000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా కొన్ని సంవత్సరాలుగా ఊహించని సరిహద్దులను చెరిపివేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

By:  Srikanth Kontham   |   11 Oct 2026 11:00 PM IST
టాలీవుడ్ నిర్మాత 3000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా కొన్ని సంవత్సరాలుగా ఊహించని సరిహద్దులను చెరిపివేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో రూపుదిద్దుకున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా ఇండియన్ సినిమా సత్తాను గ్లోబల్ స్థాయిలో చాటి చెప్పాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏకంగా 3000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు భారతీయ సినిమాలో ఏ ఒక్కరూ ఊహించని రీతిలో ప్రపంచ సినిమా రంగాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో ఈ దిగ్గజ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇంత పెద్ద బడ్జెట్ అనగానే హాలీవుడ్ కార్పొరేట్ స్టూడియోలు లేదా బహుళ నిర్మాతల భాగస్వామ్యం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఏ ఇతర పంపిణీదారులు లేదా విదేశీ స్టూడియోల భాగస్వామ్యం లేకుండా ఒంటరిగానే ఈ భారీ పెట్టుబడిని పెట్టేందుకు సదరు అగ్ర నిర్మాత సాహసంతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను భారతదేశానికే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనేది ఆ నిర్మాత బిగ్ ప్లాన్. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలు, ప్రపంచశ్రేణి విజువల్ ఎఫెక్ట్స్ , హాలీవుడ్ శైలి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమ వుతున్నాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకునే ప్రపంచస్థాయి కథాంశంతో చిత్రాన్ని మలచబోతున్నట్లు సమాచారం.

భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతోంది. భారతీయ చిత్రసీమకు చెందిన అగ్ర నటీనటులతో పాటు విదేశీ సాంకేతిక నిపుణులను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం భాగస్వాములను చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట‌.

ఇంతటి భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించడం సినీ పరిశ్రమలోనే అపూర్వమైన ఘట్టంగా నిలవనుంది. రిస్క్ ఎక్కువగా ఉన్నా? భారతీయ సినిమా సామర్థ్యంపై , గ్లోబల్ మార్కెట్ వ్యాప్తిపై ఉన్న నమ్మకమే ఆ నిర్మాతను ఇంత పెద్ద నిర్ణయం వైపు న‌డిపిస్తుంద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే తెలుగు సినిమా అంతర్జాతీయంగా హాలీవుడ్‌కు పోటీ త‌ప్ప‌ద‌నే మాట వినిపిస్తోంది.

3000 కోట్ల బడ్జెట్‌తో ఒక్క నిర్మాత ప్రపంచ వేదికపై తెలుగు జెండాను ఎగ‌రేసేందుకు వేస్తున్న అడుగు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకు వివరాలు రహస్యంగా ఉన్నా? ఈ ప్ర‌చారం మాత్రం అభిమానుల్లో.. పంపిణీదారుల్లో అంచనాలను అంత‌కంత‌కు పెంచేస్తోంది.