3 ఇడియట్స్ కాదు 4 ఇడియట్స్!
అంతే కాకుండా ఈ మూవీకి అప్పుడే టైటిల్‌ని కూడా అనుకున్నారని, సీక్వెల్‌కు `4 ఇడియట్స్` అనే టైటిల్‌ని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఫైనల్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.
By: Tupaki Entertainment Desk | 19 Dec 2025 10:54 AM ISTఎక్కడ చూసినీ ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొంత మంది పాన్ ఇండియా మూవీస్ చేస్తూ వరుస సీక్వెల్స్‌ని తెరపైకి తీసుకొస్తుంటే మరి కొంత మంది కొన్నేళ్ల క్రితం బ్లాక్ బస్టర్లుగా నిలిచిన మాస్టర్ పీస్‌లకు సీక్వెల్స్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు `3 ఇడియట్స్`. యస్ మీరు విన్నది నిజమే. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ, కరీనా కపూర్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ 2009 డిసెంబర్ 25న విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
రాజ్‌కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆమీర్‌ఖాన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద ఐకానిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాకుండా అప్పట్లో విడుదలైన సినిమాల్లో మాస్టర్ పీస్ అనిపించుకుంది. అలాంటి మూవీకి ఇన్నేళ్ల తరువాత సీక్వెల్ చేయాలని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, హీరో ఆమీర్‌ఖాన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల `దాదాసాహెబ్ ఫాల్కే` బయోపిక్ చేయాలని ప్లాన్ చేసుకున్న ఆమీర్‌ఖాన్ ఎందుకో ఆ ఆలోచనని పక్కన పెట్టి `3 ఇడియట్స్` సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడట.
ఉన్నత విద్యా వ్యవస్థలోని లొసుగుల్ని ఎత్తి చూపుతూ తెరకెక్కిన `3 ఇడియట్స్` మూవీ బాలీవుడ్‌లో అత్యంత భారీ హిట్‌గా నిలవడమే కాకుండా వన్ ఆఫ్ ది క్లాసిక్ ఫిల్మ్ అనిపించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు అలాంటి సినిమాకు సీక్వెల్ అనగానే సహజంగానే అంచనాలు తారా స్థాయికి వెళతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని పక్కా స్క్రిప్ట్‌తో రాజ్ కుమార్ హిరానీ సీక్వెల్‌ని పట్టాలెక్కించబోతున్నాడట.
ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. అంతే కాకుండా ఈ మూవీకి అప్పుడే టైటిల్‌ని కూడా అనుకున్నారని, సీక్వెల్‌కు `4 ఇడియట్స్` అనే టైటిల్‌ని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఫైనల్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఈ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం మరో క్యారెక్టర్ కూడా ఉంటుందని, ఆ క్యారెక్టర్ కోసం దానికి తగ్గ నటుడిని మేకర్స్ ప్రస్తుతం అన్వేషిస్తున్నారని తెలిసింది.
అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ని లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇన్నేళ్ల విరామం తరువాత క్లట్ క్లాసిక్ మూవీగా నిలిచిన `3 ఇడియట్స్`కు రాజ్ కుమార్ హిరాణీ సీక్వెల్ చేయబోతున్నారు కరెక్టే కానీ మళ్లీ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తారా? అనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో మొదలైంది. దీంతో `3 ఇడియట్స్` సీక్వెల్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి, హీరో ఆమీర్‌ఖాన్‌కు ఓ సవాల్‌గా మారబోతోంది. మరి ఈ సవాల్‌ని వీరిద్దరు సక్సెస్‌ఫుల్‌గా అధిగమిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
