Begin typing your search above and press return to search.

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026 సంక్రాంతి విజేతగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిలవగా, 2027 పండుగ బరిలో చిరంజీవి ‘కాకా’, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, వెంకటేశ్-కల్యాణ్ రామ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాలు సిద్ధమవుతున్నాయి. మూడు చిత్రాల షూటింగ్‌లు ముగింపు దశకు చేరడం లేదా పూర్తవడంతో డిసెంబర్ నుంచే ప్రమోషన్ల హడావుడి మొదలయ్యే అవకాశముంది. వచ్చే సంక్రాంతి విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Ramesh Palla   |   17 Nov 2026 12:38 AM IST
నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు
X

2026 సంక్రాంతికి ఏకంగా అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మొదటగా ది రాజాసాబ్‌తో సంక్రాంతి సీజన్‌ ప్రారంభం అయ్యింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ తర్వాత వచ్చిన మన శంకరవర ప్రసాద్‌ గారు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్‌ నారి నారి నడుమ మురారి సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. 2026 సంక్రాంతి విజేత మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మన శంకర వరప్రసాద్‌ అని క్లీయర్‌గా తేలిపోయింది. ఆ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే, హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసి ఉండేవి. కానీ మన శంకర వరప్రసాద్‌ మినహా మరే సినిమాలు 2026లో పెద్దగా ఆకట్టుకోలేదు. 2027 సంక్రాంతికి సైతం పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

సంక్రాంతికి కాకా సినిమాతో మెగాస్టార్‌...

2027 సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి 'కాకా' సినిమాతో రాబోతున్నాడు. ఈ ఏడాది సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కాకా సినిమాతో 2027 సంక్రాంతి విజేతగా నిలవాలని పట్టుదలతో రాబోతున్నాడు. కాకా సినిమాతో పాటు మళ్లీ 2027లోనూ శర్వానంద్‌ సంక్రాంతికి ఒక సినిమాతో రాబోతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'జార్జ్‌ క్రిష్‌' సంక్రాంతి 2027 కి విడుదల కావడం కన్ఫర్మ్‌ అయింది. ఈ సినిమాలు కాకుండా సంక్రాంతి సినిమాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న అనిల్‌ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమాతో రాబోతున్నాడు. వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాతో అనిల్ రావిపూడి వరుసగా మూడో సంక్రాంతి హిట్‌ ను తన ఖాతాలో వేసుకోవాలని ఉబలాట పడుతున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా మరో ఒకటి రెండు సినిమాలు సైతం సంక్రాంతికి ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో కాస్త ఊగిసలాట ఉంది.

శర్వానంద్‌ జార్జ్‌ క్రిష్ సినిమాతో...

ఈ మూడు సినిమాలు మాత్రం సంక్రాంతి కనీసం నెల రోజులు ఉండగానే పస్ట్‌ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జనవరి 12 విడుదల సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరిందని, డిసెంబర్‌ లో గుమ్మడి కాయ కొట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ షురూ అయినట్లు సమాచారం అందుతోంది. చిరంజీవి కాకా సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక శర్వానంద్‌ జార్జ్‌ క్రిష్ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయింది, ఇటీవల డబ్బింగ్‌ మొదలు పెట్టారు. డిసెంబర్‌ 10 వరకు పస్ట్‌ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈ మూడు సినిమాలు నెల రోజుల ముందే రెడీ కావడం వెనుక పెద్ద కారణం ఉందని సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతి పోటీ ఉంటుందని ప్రేక్షకులు ఆశ పడుతున్నారు.

అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల...

అనిల్ రావిపూడితో పోటీ పడాలంటే కంటెంట్‌ ఉంటే సరిపోదు, అందుకు తగ్గట్లుగా ప్రమోషనల్‌ కంటెంట్‌ సైతం క్రియేట్‌ చేయాలి. యూట్యూబ్‌ షాట్స్ మొదలుకుని, కామెడీ స్కిట్స్ వరకు చాలా రకాలుగా అనిల్ రావిపూడి సినిమాను ప్రమోట్‌ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన దారిలోనే తమ సినిమాలను సైతం ప్రమోట్‌ చేయడం కోసం ముందుగానే ఆయా సంక్రాంతి సినిమాల ఫిల్మ్‌ మేకర్స్ షూటింగ్‌ను ముగించుకోవాలని భావించారని తెలుస్తోంది. డిసెంబర్‌ నుంచి సంక్రాంతి సినిమాల సందడి, వాటి తాలూకు ప్రమోషన్స్‌ హడావిడి ఓ రేంజ్‌ లో ఉండే అవకాశం ఉంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం 2027 సంక్రాంతి సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ పోటీలో విజేత ఎవరు తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఏ సినిమాకు ఆ సినిమా గొప్ప అన్నట్లుగా ప్రమోట్‌ చేయబోతున్నారు. మరి చివరి ఫలితం ఏంటి అనేది చూడాలి.