Begin typing your search above and press return to search.

సమ్మర్ 2026 రిలీజ్ క్యాలెండర్ మార్పులు!

వరుసగా రిలీజ్ అవుతోన్న‌ చిత్రాలు ఓవైపు అయితే? షూటింగ్ పనుల్లో జాప్యం, ఇతర కారణాల వల్ల పలు అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

By:  Srikanth Kontham   |   29 March 2026 8:00 PM IST
సమ్మర్ 2026 రిలీజ్ క్యాలెండర్  మార్పులు!
X

2026 వేసవి టాలీవుడ్‌కు కీలకంగా మారింది. వరుసగా రిలీజ్ అవుతోన్న‌ చిత్రాలు ఓవైపు అయితే? షూటింగ్ పనుల్లో జాప్యం, ఇతర కారణాల వల్ల పలు అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు ప్రేక్షకుల ఆసక్తిని పెంచడమే కాదు. బాక్సాఫీస్ వద్ద నెలకొనే పోటీని కూడా ప్రభావితం చేస్తున్నాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ న‌టిస్తోన్న‌ భారీ చిత్రం `పెద్ది` విడుదల తేదీ మారిన సంగ‌తి తెలిసిందే. తొలుత మార్చి 27న భారీ ఎత్తున విడుదల కావాల్సిన చిత్ర‌మిది. కానీ ఇప్పుడీ చిత్రం ఏప్రిల్ 30కి వాయిదా ప‌డింది.

ఆ తేదీనా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందిగ్ద‌త ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వ‌హిస్తోన్న‌ ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటంతో, నిర్మాతలు విడుదల తేదీని ఎంచుకోవడంలో గంద‌రగోళానికి గుర‌వుతున్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని న‌టిస్తోన్న `ది పారడైస్` కూడా రిలీజ్ రేసులో వెనక్కి తగ్గింది. తొలుత మార్చిలో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ ని ఆగస్టు 21 వాయిదా వేసారు. ప్రేక్షకులకు నాణ్యమైన సినిమాను అందించాలన్న ఉద్దేశంతోనే ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప‌ని చేస్తున్నారు. కన్నడ స్టార్ యష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `టాక్సిక్' కూడా సమ్మర్ చివరికి వెళ్లింది.

అంతర్జా తీయంగా తలెత్తిన అనివార్య పరిస్థితుల నేప‌థ్యంలో మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాన్ని జూన్ 4కి వాయిదా వేసారు. ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తుండటంతో విడుదల తేదీ వాయిదా పడటం అనివార్యమైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న‌ భారీ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` విషయంలో కూడా ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. తొలుత వేసవిలో విడుదల కావాల్సిన చిత్రం జూలై నెలలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. భారీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండటంతో సినిమాను మరింత మెరుగ్గా అందిం చేందుకు నిర్మాత‌లు కృష్టి చేస్తున్నారు. దీనిలో భాగంగా జూలై లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.

ఈ విడుదల తేదీల మార్పులు పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని పెంచుతున్నాయి. ఒక సినిమాతో మరొకటి పోటీ పడకుండా బాక్సాఫీస్ వద్ద ప్రతి సినిమాకు తగినంత గ్యాప్ ఉండేలా చూసుకోవడం నిర్మాతల వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల థియేటర్లలో ప్రేక్షకులు వరుసగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. మొత్తానికి 2026 సమ్మర్ బాక్సాఫీస్ ఒక క్రమ పద్ధతిలో సాగేలా కనిపిస్తోంది. ఈ గ్యాప్ లో చాలా చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌ని లేకుండా ఆద‌ర‌ణ‌కు నోచుకుంటున్నాయి.