Begin typing your search above and press return to search.

2026: మిగతా బాక్సాఫీస్ ఎవరిదీ?

వీటిలో కొన్ని డేట్స్ అధికారికంగా లాక్ కాగా, మరికొన్ని ఇంకా డేట్ విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నాయి.

By:  M Prashanth   |   30 Aug 2026 12:00 AM IST
2026: మిగతా బాక్సాఫీస్ ఎవరిదీ?
X

ఆగస్టు ముగిసేసరికి 2026 తెలుగు బాక్సాఫీస్‌లో పెద్ద సినిమాల మొదటి రౌండ్ దాదాపు పూర్తయింది. ‘పెద్ది’ రూ.340 కోట్ల దగ్గర ఆగగా, ‘ఇరుముడి’ ఇంకా రన్‌లో ఉంది. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు నాని, విజయ్ దేవరకొండ, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని డేట్స్ అధికారికంగా లాక్ కాగా, మరికొన్ని ఇంకా డేట్ విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నాయి.

సెప్టెంబర్ 24న నాని ‘ది ప్యారడైజ్’ వస్తోంది. శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా తీసుకొస్తున్నారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ వాల్యుయేషన్ రూ.100 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ రిస్క్ కూడా అదే. తెలుగు మార్కెట్‌తో సరిపెట్టకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఓపెనింగ్ రావాలి. అప్పుడే పెట్టిన బిజినెస్‌కు తగ్గ రేంజ్ దొరుకుతుంది.

అక్టోబర్ 16ను విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రానుంది. రష్మిక సెప్టెంబర్ నుంచి వాయిదా పడిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ఇప్పుడు దసరా సీజన్‌లోకి వచ్చింది. అదే సమయంలో ‘జైలర్ 2’ అక్టోబర్ 15న, ‘ఓం చాప్టర్ 1’ అక్టోబర్ 16న వస్తున్నాయి. అంటే ‘రణబాలి’కి ఓపెనింగ్ మాత్రమే కాదు, స్క్రీన్స్ విషయంలో కూడా గట్టి పోటీ ఉంటుంది.

డిసెంబర్‌లో మాత్రం పెద్ద లిస్ట్ కనిపిస్తోంది. ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3కు అధికారికంగా ఫిక్స్ అయింది. ఈ ఏడాది రూ.500 కోట్ల మార్క్‌ను తెలుగు సినిమా దాటాలంటే ప్రస్తుతం ఎక్కువ అవకాశం ఈ సినిమాకే కనిపిస్తోంది. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ఇక్కడ ప్లస్. హిందీ మార్కెట్, ఓవర్సీస్ రన్ కూడా హై రేంజ్ కలెక్షన్స్ రావాలి. లేకపోతే భారీ ఓపెనింగ్ ఉన్నా 500 కోట్ల దారి ఈజీ కాదు.

ఇక క్రిస్మస్‌కు పరిస్థితి ఇంకా గట్టిగా ఉంది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా డిసెంబర్ 24ను ముందే ప్రకటించింది. ఇప్పుడు నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌తో అదే డిసెంబర్ 24 రిలీజ్‌ను అధికారికంగా చెప్పేశారు. దీంతో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకే రోజున క్లాష్ కానున్నాయి. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ కూడా డిసెంబర్‌లోనే వస్తుందని మేకర్స్ చెబుతున్నారు, కానీ పూర్తి డేట్ ఇంకా లేదు. అది ఎక్కడ సెట్ అవుతుందో బట్టి నెల చివరి లెక్క మారొచ్చు. ‘విశ్వంభర’, ‘మైసా’ లాంటి సినిమాలు కూడా 2026 లిస్ట్‌లోనే కనిపిస్తున్నాయి. కానీ వాటికి ఇప్పటివరకు పూర్తి రిలీజ్ డేట్ లేదు. సెప్టెంబర్ నుంచి క్రిస్మస్ వరకు అధికారికంగా ఉన్న సినిమాల్లో ఏ ఏ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.