Begin typing your search above and press return to search.

2025 బుక్ మై షో టాప్ లిస్ట్.. అఖండ 2 స్థానం ఎక్కడ?

ఈ ఏడాది (2025) టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాల హడావుడి మామూలుగా జరగలేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు.

By:  M Prashanth   |   12 Dec 2025 1:40 PM IST
2025 బుక్ మై షో టాప్ లిస్ట్.. అఖండ 2 స్థానం ఎక్కడ?
X

ఈ ఏడాది (2025) టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాల హడావుడి మామూలుగా జరగలేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశారు. అయితే ఒక సినిమా రిలీజ్ కు ముందు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో చెప్పడానికి 'బుక్ మై షో' (BMS) ప్రీ సేల్స్ నెంబర్లే ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఏడాది చివరలో ఈ లిస్ట్ చూస్తుంటే.. స్టార్ హీరోల డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే అని చెప్పాలి. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన 'దే కాల్ హిమ్ ఓజీ' (OG) సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. రిలీజ్ కు ముందే దాదాపు 950K ప్రీ సేల్స్ తో ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పవన్ స్టైలిష్ లుక్, ఆ క్రేజ్ చూసి ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' 815K ప్రీ సేల్స్ తో నిలిచింది.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం 'హరి హర వీరమల్లు' కూడా 503K ప్రీ సేల్స్ తో మూడో స్థానంలో నిలిచింది. అలాగే సంక్రాంతి సీజన్ లో వచ్చిన వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 442K ప్రీ సేల్స్ తో తన సత్తా చాటింది. సీనియర్ హీరో అయినా వెంకీ మామ స్టామినా ఏంటో ఈ నెంబర్లు రుజువు చేశాయి. అయితే ఈ లిస్ట్ లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఈ రోజే రిలీజ్ అయిన 'అఖండ 2' గురించి. ఈ లిస్ట్ లో అఖండ 2 ఆరో స్థానంలో (300K) కనిపిస్తున్నా, దాని వెనుక ఉన్న కథ వేరు.

రిలీజ్ కు ముందు ఈ సినిమాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో తెలిసిందే. అసలు సినిమా వస్తుందా రాదా అనే టెన్షన్ చివరి నిమిషం వరకు ఉంది. బుకింగ్స్ కూడా కేవలం ఒక్క రోజు ముందే ఓపెన్ అయ్యాయి. ప్రమోషన్స్ కు అస్సలు టైమ్ దొరకలేదు. అయినా సరే 3 లక్షల ప్రీ సేల్స్ ను రాబట్టిందంటే, బాలయ్య బ్రాండ్ ఇమేజ్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు.

మిగతా సినిమాల విషయానికి వస్తే.. నాని 'హిట్ 3' ఫ్రాంచైజీ క్రేజ్ తో 336K మార్కును అందుకోగా, 'కింగ్డమ్', 'డాకు మహారాజ్' సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే తేజ సజ్జా 'మిరాయ్', నాగ చైతన్య 'తండేల్' కూడా ఆడియెన్స్ లో మంచి ఆసక్తిని కలిగించాయి.

2025 టాప్ 10 BMS ప్రీ సేల్స్ లిస్ట్

OG: 950K

గేమ్ ఛేంజర్: 815K

హరి హర వీరమల్లు: 503K

సంక్రాంతికి వస్తున్నాం: 442K

హిట్ 3: 336K

అఖండ 2: 300K

కింగ్డమ్: 268K

డాకు మహారాజ్: 235K

మిరాయ్: 194K

తండేల్: 155K