80స్ రీ యూనియన్ 2025.. సరికొత్త థీమ్ తో సందడి చేసిన సెలెబ్రిటీస్!
సౌత్ ఇండస్ట్రీలో 1980లలో కలిసి పనిచేసిన చాలామంది సినీ తారలు ఒక్క దగ్గర చేరి.. గత కొన్ని సంవత్సరాల నుండి రీ యూనియన్ పేరిట సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
By: Madhu Reddy | 5 Oct 2025 5:16 PM ISTసౌత్ ఇండస్ట్రీలో 1980లలో కలిసి పనిచేసిన చాలామంది సినీ తారలు ఒక్క దగ్గర చేరి.. గత కొన్ని సంవత్సరాల నుండి రీ యూనియన్ పేరిట సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అలా ప్రతి ఏడాది ఈ రీ యూనియన్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించుకుంటున్నారు ఈ సినీ తారలు.. ఇందులో భాగంగా గత ఏడాది జరగాల్సిన 80's రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.దానికి కారణం గత ఏడాది చెన్నైలో వరదలు రావడం వల్ల ఈ రీ యూనియన్ ని వాయిదా వేసుకున్నారు.
దాంతో ఈ ఏడాది ఈ రీ యూనియన్ వేడుకల్ని అక్టోబర్ 4న చెన్నైలో గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో దాదాపు 31 మంది 1980లో ప్రేక్షకులని తమ నటనతో ఆకట్టుకున్న సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఇప్పటికే వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు,వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే ఈ రీ యూనియన్ లో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా రమ్యకృష్ణ తన కోస్టార్స్ తో దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఇందులో అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటో తో పాటు నటుడు ప్రభు తో క్లోజ్ గా దిగిన ఫోటోని, చిరంజీవితో దిగిన ఫోటోని తన సహ నటీమణులతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేసుకుంది.
ప్రస్తుతం రమ్యకృష్ణ షేర్ చేసిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ లు కూడా ఈ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి తమ అనుభవాలను పంచుకున్నారు. అలా చిరంజీవి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోని షేర్ చేసి ఎన్నిసార్లు రీ యూనియన్ ఏర్పాటు చేసుకున్నా కూడా అది మొదటి సారే అన్నట్లుగా ఉంది. ఎంతో హ్యాపీగా ఈవెంట్ జరిగింది అని పోస్ట్ పెట్టారు. ఇందులో పాల్గొన్న చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ ఫొటోస్ ని షేర్ చేశారు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీ లందరూ చిరుత థీమ్ ని ఎంచుకొని చిరుత ప్రింట్ తో ఉన్న డ్రెస్సులని ధరించారు.
ఇక ఈ ఈవెంట్ లో వెంకటేష్, చిరంజీవి,జయసుధ, నరేష్,నదియా, జయరాం, జాకీ ష్రాఫ్, రాధా, సుమలత, రమ్యకృష్ణ, రేవతి,మీనా, కుష్బూ,శరత్ కుమార్, ప్రభు,భానుచందర్, సుహాసిని, రషీన్ రెహమాన్, గీత వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ రీ యూనియన్ లో తాము కలిసి పనిచేసిన సమయంలో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు తమ సినీ కెరియర్ ఎలా ఉంది.. కుటుంబ యోగక్షేమాలు ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఈ ఈవెంట్ కోసం చిరంజీవి, వెంకటేష్ కలిసి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.
