2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!
హాలీవుడ్ హారర్ హిట్ ‘1408’కు 19 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫేమ్ నటాలియా డయర్ ప్రధాన పాత్రలో, ఎలిజా వుడ్ కీలక పాత్రలో నటించనున్నారు. తొలి భాగం దర్శకుడు మైకేల్ హాఫ్‌స్ట్రోమ్‌నే సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి, 2028లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
By: Srikanth Kontham | 7 Nov 2026 7:19 PM ISTప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ క్యుసాక్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం `1408` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా 19 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ కు రంగం సిద్దమ వుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ హాలీవుడ్ ప్రముఖ నటీనటులు నటాలియా డయర్, ఎలిజా వుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. నెట్ ప్లిక్స్ లో అత్యంత ప్రజాధారణ పొందిన `స్ట్రేంజర్ థింగ్స్`సిరీస్ ఫేం నటాలియా డయర్ సీక్వెల్ లో మెయిన్ లీడ్ పోషిస్తున్నారు.
అలాగే`ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్`చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎలిజా వుడ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన తారాగణం సైతం సీక్వెల్ లో భాగం కావడం విశేషం. మాతృకలో జాన్ క్యుసాక్, శామ్యూల్ ఎల్, జాక్సన్ రీ ఎంట్రీపై మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. వీరంతా ఇందులో సెకెండ్ లీడ్స్ పోషించే అవకాశముందని సమాచారం. సీనియర్ రచయిత కింగ్ 1999 లో రాసిన షార్ట్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 1408 సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కల్ట్ హిట్ గా నిలిచింది.
డాల్పిన్ హోటల్ లో రూమ్ నెంబర్ 1408 లో తిరిగే హారర్ కథ ప్రేక్షకులకు ఎంతగానో భయపెట్టింది. ఆ సమయంలో ప్రయివేట్ లాడ్జ్ ల్లో దిగాలంటే భయపడేంత గా ఈ థ్రిల్లర్ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. మొదటి భాగాన్ని తెరకెక్కించిన మైకేల్ హాఫ్‌స్ట్రోమ్ మరోసారి కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నారు. అతడితో పాటు స్క్రీన్‌ప్లే కోసం మరో దర్శకుడు మార్క్ వెర్హీడెన్ కూడా భాగమవుతున్నారు. లొరెంజో డి బొనావెంతురా, రిచర్డ్ సాపర్‌స్టెయిన్, స్పేస్‌గ్లాస్ మీడియా గ్రూప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధిచి పూర్తి వివరాలు..కథాంశాన్ని అత్యంత గొప్యంగా ఉంచారు. సీక్వెల్ కథకు సంబం ధించి ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్దమైంది. నటీనటులు సహా సాంకేతిక విభాగం ఎంపికపై మేకర్స్ దృష్టి పెట్టారు. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే షూటింగ్ ఏడాది పాటు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే సినిమా 2028 ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.
