Begin typing your search above and press return to search.

గడ్డకట్టే చలిలో హీరోలు సాహసం.. ఏ చిత్రానికో తెలిస్తే గూస్ బంప్స్!

గడ్డకట్టే చలిలో కూడా ఈ షూటింగ్ చేశారట.. అలా గ్రీన్ స్క్రీన్, విజువల్స్ ఏవి వాడుకోకుండా లడఖ్ లోనే ఈ సన్నివేశాలన్నీ రియాల్టీగా చేసినట్టు ఫర్హాన్ అక్తర్ తెలియజేశారు.

By:  Madhu Reddy   |   15 Aug 2025 12:37 PM IST
గడ్డకట్టే చలిలో హీరోలు సాహసం.. ఏ చిత్రానికో తెలిస్తే గూస్ బంప్స్!
X

ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా మూవీ 120 బహదూర్.. రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1962లో జరిగిన చైనా భారతదేశం యుద్ధంలోని రెజాంగ్ లా యుద్ధం ఆధారంగా తెరకెక్కింది. రెజాంగ్ లా యుద్ధంలో సైనికులు వీరోచిత పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి.. ? సైనికులు లడక్ లోని తమ స్థావరాన్ని ఎలా కాపాడారు? అనే విషయాన్ని '120 బహదూర్' అనే సినిమాలో చూపించారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు ఫర్హాన్ అక్తర్. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ డైరెక్టర్, నటుడు అయినటువంటి ఫర్హాన్ అక్తర్ ఏం చేసినా చాలా స్పెషల్ గా చేస్తారు. ఆయన దర్శకత్వంలో ఏదైనా సినిమా వచ్చినా లేదా ఆయనే సినిమా చేసినా అందులో ఏదో ఒక స్పెషాలిటీ కచ్చితంగా ఉంటుంది అని అభిమానుల నమ్మకం. అయితే అలాంటి అంచనాలతోనే 120 బహదూర్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. 1962 చైనా - భారత్ యుద్ధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.. ఇక రెజాంగ్ లా యుద్ధంలో సైనికులు వీరోచితంగా పోరాడారు. దాదాపు 3,000 మంది చైనా సైనికులను కేవలం 120 మంది భారత సైనికులే ఎదుర్కొన్నారు. లడఖ్ లోని రెజాంగ్ లా కనుమ వద్ద ఈ యుద్ధం జరిగింది.. లడఖ్ లోని తమ స్థావరాన్ని కాపాడుకోవడం కోసం 120 మంది భారత సైనికులు 3000 మంది చైనా సైనికులను ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ఈ యుద్ధంలో దాదాపు 1400 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది.తమకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న సైన్యాన్ని కూడా భారత సైన్యం చాలా ధైర్యంగా ఎదుర్కొంది అంటే వారి గట్స్ కి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే అలాంటి యుద్ధ సమయంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా 120 బహదూర్ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమాలో గ్రీన్ స్క్రీన్ వాడకుండా చాలావరకు సన్నివేశాలను లడఖ్ భూభాగంలోనే చిత్రీకరించారట. సైనికులు ఎలాంటి కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం కోసమే ఇలా లడఖ్ లోనే ఈ చిత్ర షూటింగ్ చేశారట..

గడ్డకట్టే చలిలో కూడా ఈ షూటింగ్ చేశారట.. అలా గ్రీన్ స్క్రీన్, విజువల్స్ ఏవి వాడుకోకుండా లడఖ్ లోనే ఈ సన్నివేశాలన్నీ రియాల్టీగా చేసినట్టు ఫర్హాన్ అక్తర్ తెలియజేశారు. అయితే ఇలాంటి లొకేషన్ లో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. శారీరకంగా చాలా కష్టమైన పని. అయినప్పటికీ అప్పటి సైనికులు పడ్డ ఇబ్బందులను రియాల్టీగా చూపించడం కోసమే చిత్ర యూనిట్ ఇలా చేసినట్టు ఫర్హాన్ అక్తర్ తెలియచేశారు. మరి ఇంత రియాల్టీగా చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.