Begin typing your search above and press return to search.

శ్రీమంతుడుతో మొదలు పెట్టి.. మైత్రి సినీ ప్రస్థానం..!

శ్రీమంతుడు నుంచి రీసెంట్ గా రిలీజైన 8 వసంతాలు వరకు ప్రతి సినిమాకు కథకు తగిన బడ్జెట్ కేటాయిస్తూ దర్శకులకు ఫ్రీడం ఇచ్చి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు మైత్రి నిర్మాతలు.

By:  Ramesh Boddu   |   7 Aug 2025 3:24 PM IST
శ్రీమంతుడుతో మొదలు పెట్టి.. మైత్రి సినీ ప్రస్థానం..!
X

టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ గా పేరు తెచ్చుకున్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్. యూఎస్ లో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ ఇంట్రెస్ట్ తోనే సినిమా ప్రొడక్షన్ లోకి దిగారు మైత్రి వారు. సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో తొలి ప్రయత్నం చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా విలేజ్ ఎడాప్షన్ కాన్సెప్ట్ తో వచ్చింది. నేటితో ఆ సినిమా రిలీజై 10 ఏళ్లు అవుతుంది. అంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తొలి సినిమా రిలీజై 10 ఏళ్లు అయ్యింది.

కథకు తగిన బడ్జెట్ కేటాయిస్తూ..

శ్రీమంతుడు నుంచి రీసెంట్ గా రిలీజైన 8 వసంతాలు వరకు ప్రతి సినిమాకు కథకు తగిన బడ్జెట్ కేటాయిస్తూ దర్శకులకు ఫ్రీడం ఇచ్చి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు మైత్రి నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు వై. రవి శంకర్, నవీన్ ఎర్నేని. ఈ ఇద్దరే ప్రొడక్షన్ బాధ్యతలను చూస్తుంటారు. పదేళ్ల సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మైత్రి నిర్మాతలు.

అంతేకాదు క్రేజీ కాంబినేషన్స్, భారీ బడ్జెట్ సినిమాలను కూడా చేస్తున్నారు మైత్రి వాళ్లు. ఈమధ్యనే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్. కొన్ని ఆసక్తికరమైన ఇతర భాల సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

స్టార్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలను..

పదేళ్ల ప్రయాణంలో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాదు లో బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చేస్తూ ప్రొడక్షన్ స్పెషాలిటీ చాటుతూ వచ్చారు మైత్రి వారు. ప్రస్తుతం వారి ప్రొడక్షన్ నుంచి చాలా సినిమాలు రాబోతున్నాయి. కేవలం స్టార్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా వారు నిర్మిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ సినిమాలంటే చాలు ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడేలా చేశారు. రాబోతున్న సినిమాల్లో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, రాం చరణ్ సుకుమార్ మూవీ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఈ ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. తెలుగు సినిమాలే కాదు తమిళ్, మలయాళం, హిందీ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

10 ఏళ్ల ప్రయాణంలో సక్సెస్ లు ఫెయిల్యూర్స్ రుచి చూసిన మైత్రి మూవీ మేకర్స్ తమ నిర్మాణ సంస్థను ఇలానే సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ఆశిద్దాం.