Begin typing your search above and press return to search.

1000 కోట్ల బ‌డ్జెట్! టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జాక్ పాట్?

కొంద‌రు వ్యాపార‌వేత్త‌లు లేదా పారిశ్రామిక వేత్త‌ల డ్యాషింగ్ ప్లానింగ్స్ గురించి వింటే గ‌గుర్పాటుకు గురి కావాల్సిందే. ఒక్కోసారి వెన్నులో ఒణుకు పుడుతుంది.

By:  Sivaji Kontham   |   20 Feb 2026 3:00 PM IST
1000 కోట్ల బ‌డ్జెట్! టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జాక్ పాట్?
X

కొంద‌రు వ్యాపార‌వేత్త‌లు లేదా పారిశ్రామిక వేత్త‌ల డ్యాషింగ్ ప్లానింగ్స్ గురించి వింటే గ‌గుర్పాటుకు గురి కావాల్సిందే. ఒక్కోసారి వెన్నులో ఒణుకు పుడుతుంది. మాట్లాడితే 500కోట్లు, 1000కోట్లతో సినిమా తీయ‌డం.. వీళ్ల‌కు జూదం లాంటిది. ప్రెస్టేజ్ కోసం ప్రాణం పెడ‌తారు. అలాంటి బాప‌తు వ్యాపార సామ్రాజ్యం నుంచి ఒక ప్ర‌ముఖురాలు టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల‌తో సినిమాల‌ను నిర్మించేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ద‌శాబ్ధాల కాలంలో ఈ సంస్థ ఏకంగా రూ.6,00,000 కోట్ల (6ల‌క్ష‌ల కోట్లు) వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. అందులో ఒక ప్ర‌మోట‌ర్ నిక‌ర ఆస్తి విలువ ఏకంగా 2,00,000 కోట్లు (2ల‌క్ష‌ల కోట్లు). ఇప్పుడు ఈ ప్ర‌మోట‌ర్ కుమార్తె వినోద‌రంగంపై మ‌క్కువ‌తో రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ కి పోటీగా సొంత స్టూడియోని, బ్యాన‌ర్ ల‌ను ప్రారంభించి వ‌రుస పెట్టి పాన్ ఇండియ‌న్ సినిమాల‌ను నిర్మించేందుకు ప్రణాళిక‌ల్ని ర‌చిస్తున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

అయితే స‌ద‌రు స్టూడియో య‌జ‌మాని, యువ ఔత్సాహిక మ‌హిళా నిర్మాత ప్లానింగ్స్ చూస్తుంటే దిగ్గ‌జ ఇండ‌స్ట్రీ నిర్మాత‌లంతా దిగ‌దుడుపే. క‌ళారంగంతో త‌న‌కు ఇప్ప‌టికే మంచి అనుబంధం ఉంది. అంత‌ర్జాతీయ స్థాయి గాయ‌నిగాను పాపుల‌రైంది. క్రీడారంగంలో క్రికెట్ అంటే విప‌రీత‌మైన అభిమానం. గొప్ప అభిరుచితో ఉన్న ఈ యువ మ‌హిళా నిర్మాత త‌దుప‌రి టాలీవుడ్ లో ఉన్న అర‌డ‌జ‌ను మంది పాన్ ఇండియా స్టార్ల‌పై క‌న్నేసార‌ని స‌మాచారం. వీళ్లంద‌రితో భారీ పాన్ ఇండియా ఇనిమాలు తీయాల‌నేది బేసిక్ ప్లాన్. ఇప్ప‌టికే ఒక ప్ర‌ముఖ తెలుగు పాన్ ఇండియా హీరోతో మంత‌నాలు సాగిస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ఇంకా ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నందున దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం బ‌య‌ట వినిపించ‌డం లేదు. ఒక‌సారి ప్రాజెక్ట్ క‌మిటైతే, త‌దుప‌రి ప్ర‌క‌ట‌న వ‌చ్చేందుకు వీలుంటుంది.

అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ల‌లో ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, మ‌హేష్ వంటి వారితో స‌ద‌రు పారిశ్రామిక వేత్త కం మ‌హిళా నిర్మాత భారీ సినిమాల‌ను నిర్మించేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తొలిగా ఏ హీరో జాక్ పాట్ కొడుతున్నారు? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్. అయితే ఈ పారిశ్రామిక వేత్త‌లు బ‌రిలో దిగితే 1000 కోట్లు అంత‌కుమించిన బ‌డ్జెట్ల‌ను కేటాయించేందుకు వెన‌కాడ‌రు. దానికి త‌గ్గ‌ట్టు స‌త్తా ఉన్న రాజ‌మౌళి, సుకుమార్ రేంజు ద‌ర్శ‌కుల కోస‌మే వేచి చూస్తున్నార‌ని తెలుస్తోంది. అగ్ర హీరోల కాల్షీట్లతో పాటు ఈ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల కాల్షీట్లు చిక్క‌డం అంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. కానీ భారీ కాన్వాసుతో బ‌రిలో దిగే ఈ కొత్త కార్పొరెట్ నిర్మాత‌ను ఎంక‌రేజ్ చేస్తార‌ని భావించ‌వ‌చ్చు. ఈ నిర్మాత‌లు ఎవ‌రు అనేదానికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో.. జ‌స్ట్ వెయిట్..!