2026 సెకండ్ హాఫ్.. అన్ని ఇండస్ట్రీలలో వెయ్యి కోట్ల కళ
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
By: M Prashanth | 1 Aug 2026 11:23 AM ISTపాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక ఏ ఇండస్ట్రీ చూసినా వెయ్యి కోట్ల టార్గెట్ తోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 2026 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు రాబోయే సినిమాల లైనప్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అన్న తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
ముందుగా శాండిల్ వుడ్ విషయానికి వస్తే, కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యశ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో 'టాక్సిక్' అనే సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై ఇంకా అనుకున్నంత స్థాయిలో బజ్ లేదు. రాబోయే కంటెంట్ కీలకం కానుంది. కానీ క్లిక్కయితే కియారా అద్వానీ, నయనతార లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో వెయ్యి కోట్ల లెక్క కష్టమేమీ కాదు.
ఇక టాలీవుడ్ నుంచి ఏకంగా మూడు భారీ సినిమాలు ఈ రేసులో ఉన్నాయి. ఆగస్టు 21న పాన్ ఇండియా స్థాయిలో 'ది ప్యారడైజ్' రిలీజ్ కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 15న పెద్ద స్కేల్ లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' థియేటర్లలోకి రాబోతోంది. వీటితో పాటు డిసెంబర్ 3న హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మిలిటరీ డ్రామా 'ఫౌజీ' కూడా రానుంది. ఇది ముఖ్యంగా 1000 కోట్ల బొమ్మ అనే టాక్ నడుస్తోంది. హను ఎమోషన్ క్లిక్కయితే ఆ టాక్ నిజమైనట్లే.
కోలీవుడ్ కూడా ఈ బాక్సాఫీస్ రేసులో ఏమాత్రం తగ్గడం లేదు. అక్టోబర్ 15న రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో 'జైలర్ 2' విడుదల కానుంది. మొదటి భాగం ఇచ్చిన సక్సెస్ తో ఈ యాక్షన్ సీక్వెల్ మీద ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇందులో విజయ్ సేతుపతి కూడా ఉండటం ప్రాజెక్టుకు అదనపు బలం. జైలర్ 1 వెయ్యి కోట్లకు కొంచెం దూరంలో ఆగింది. మరి ఈసారి తలైవా ఆ మార్క్ ను అందుకుంటాడో లేదో చూడాలి.
చివరగా బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర తమ మార్కెట్ ని పరీక్షించుకోనున్నాయి. సెప్టెంబర్ 4న ఓటీటీ సెన్సేషన్ 'మీర్జాపూర్' థియేట్రికల్ మూవీగా పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ కాంబినేషన్ లో రానుంది. నవంబర్ నెలలో నితీష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న 'రామాయణ' రిలీజ్ కానుంది. ఆ తర్వాత డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' రాబోతోంది. ఈ చిత్రంలో షారుఖ్ తో పాటు దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. రామాయణ, కింగ్ రెండు కూడా వెయ్యి కోట్ల బొమ్మలే.
ఇలా అన్ని ఇండస్ట్రీలు తమ బెస్ట్ ప్రొడక్ట్స్ తో ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఒక్కో సినిమా లేదంటే మరికొన్ని కలిసి వేల కోట్ల బిజినెస్ తో మళ్ళీ థియేటర్స్ కు బూస్ట్ ఇవ్వనున్నాయి. భారీ బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లానింగ్ వల్ల ఈ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ సినిమా కంటెంట్ ఏ స్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుందనే దానిపైనే బాక్సాఫీస్ నెంబర్స్ ఆధారపడి ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
