తమన్నా ఐటెం సాంగ్ కు అరుదైన రికార్డు
సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మోత మోగించిన ఈ సాంగ్, ఇప్పుడు యూట్యూబ్ లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 17 Jan 2026 3:20 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన గ్లామర్, డ్యాన్సులతో అందరినీ షేక్ చేసిన సాంగ్ ఆజ్ కీ రాత్. 2024లో బాలీవుడ్ లో వచ్చిన స్త్రీ2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడానికి ఈ పాట కూడా ఒక కారణం. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో మోత మోగించిన ఈ సాంగ్, ఇప్పుడు యూట్యూబ్ లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆజ్ కీ రాత్ వీడియో సాంగ్ 100 కోట్ల వ్యూస్ ను క్రాస్ చేసింది.
మొదటి వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు..
ఆజ్ కీ రాత్ సాంగ్ అరుదైన రికార్డును అందుకున్న కారణంగా తమన్నా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని తెలియచేస్తూ తమన్నా ఓ వీడియోను పోస్ట్ చేయగా, ఆ వీడియోలో సాంగ్ షూటింగ్ నాటి బిహైండ్ సీన్స్ క్లిప్స్ ను షేర్ చేశారు. ఈ సాంగ్ ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ వ్యూస్ వరకు ఎంతో ప్రేమను కురిపించినందుకు తమన్నా అందరికీ థ్యాంక్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
భారీ కలెక్షన్లను అందుకున్న స్త్రీ2
తమన్నా పోస్ట్ చేసిన వీడియోలో షాట్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ చాలా బాగా వచ్చింది. కానీ మరో టేక్ చేద్దామా అనగా, తమన్నా సరదాగా నో అని అరిచిన క్లిప్ ఇప్పుడు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా విషయానికొస్తే రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన స్త్రీ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుని ఆ ఏడాదిలోని అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఈ పాటకు సచిన్- జిగర్ మ్యూజిక్ అందించగా, మధుబంతి బాగ్చి, దివ్య కుమార్ ఆలపిచారు. అమితాబ్ భట్టాచార్య ఆజ్ కీ రాత్ సాంగ్ కు సాహిత్యం అందించారు. ఇక తమన్నా విషయానికొస్తే ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా దీపక్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీవీఏఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మే 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏదేమైనా తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
