బీజేపీ పాలన.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజన్ తెలిస్తే.. అవాక్కే!
పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చేందుకు సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కథనం పేర్కొంది. వచ్చే నెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి, అనంతరం కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. పేరు మార్పుతో సమావేశాల్లో రాష్ట్రానికి ముందుగా మాట్లాడే అవకాశం వస్తుందని సీఎం వివరణ ఇచ్చినట్లు కథనం తెలిపింది.
By: Garuda Media | 24 Nov 2026 6:20 AM ISTరాష్ట్రాల్లో బీజేపీ పాలన ప్రారంభం కాగానే తమ దైన మార్కును వేసుకునే ప్రయత్నం చేయడం తెలిసిందే. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలకు కూడా పేర్లు మార్చిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా `పశ్చిమ బెంగాల్` రాష్ట్రం పేరును మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. ప్రస్తుతం `పశ్చిమ బెంగాల్` చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఒకప్పుడు బంగ్లాదేశ్(ఇది కూడా భారత్‌లో భాగమే)లో ఉండేది. తర్వాత.. కాలంలో కొంత ప్రాంతాన్ని భారత్‌కు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్ అయింది.
ఇది బ్రిటీష్ హయాం నుంచి కూడా అమల్లో ఉంది. `బెంగాల్` అనేది స్థానిక భాషకు కూడా గుర్తుగా వాడతారు. ఇక, తాజాగా ప్రభుత్వం బెంగాల్ స్థానంలో `బంగ` అనే పేరును పేర్కొంది. అంటే.. ఇక నుంచి పశ్చిమ బెంగాల్ కాస్తా.. `పశ్చిమ బంగా` కానుంది. దీనికి మంత్రి వర్గం ఆమోదించింది. వచ్చే నెలలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీని కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు. అనంతరం.. కేంద్రానికి పంపనున్నారు. కేంద్రంలోనూ బీజేపీనే ఉన్న నేపథ్యంలో అక్కడ ఆమోదం పొందడం సులువుగానే జరగనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం.. ఆ తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న రాష్ట్రాల జాబితాలోనూ పశ్చిమ బంగా చేరడం ఖాయమైంది.
సర్కారు వారి కారణం వింతగా ఉందే!
ఇక, రాష్ట్రానికి పేరు ఎందుకు మార్చారు? అంటే.. సీఎం సువేందు అధికారి చిత్రమైన వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానీ.. ప్రపంచ స్థాయి సదస్సులు కానీ జరిగినప్పుడు.. రాష్ట్రం తరఫున మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. అయితే.. రాష్ట్రం పేరులో వెస్ట్(west) ఉండడంతో తమకు అక్షరమాల ప్రాధాన్యం మేరకు మాట్లాడేందుకు చివరలో అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. దీనివల్ల తమ సమస్యలు ప్రస్తావించేందుకు సమయం సరిపోవడం లేదని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. ప్రజలు కూడా నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఈ సమస్యలను పరిష్కరించేందుకు `పశ్చిమ బంగా`గా పేరు మార్చుతున్నట్టు చెప్పారు.
దీనిని ఇంగ్లీష్‌లో కూడా `పశ్చిమ`(paschima) అనే చదవాలని.. వెస్ట్ అనడానికి వీల్లేదని పేర్కొన్నారు. మరి బెంగాల్ కాస్తా.. బంగా అయింది కదా? అంటే.. స్థానిక `వంగ` భాషకు గుర్తుగా `బంగ` మార్చినట్టు పేర్కొన్నారు. దీంతో తమకు ఆయా సదస్సులు, సమావేశాల సమయంలో ప్రాధాన్యం పెరుగుతుందన్నది సర్కారు వివరణ. ఇక, ఈ వ్యవహారంపై మాజీ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. రాష్ట్రం ముందుండాలన్నదే తనకోరిక అని చెప్పారు. ఇదే విషయాన్ని తాముకూడా పరిశీలించామని.. కానీ, అప్పట్లో బీజేపీ నేతలు అడ్డుపడ్డారని తనదైన శైలిలో ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా `వెస్ట్ బెంగాల్` కాస్తా.. `పశ్చిమ బెంగా`గా మారపోనుంది.
