Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్...యూపీని రెండు ముక్కలు చేయాల్సిందే !

డీలిమిటేషన్‌తో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలు 403 నుంచి 605కు పెరగవచ్చనే అంచనాలు చర్చనీయాంశమయ్యాయి. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలతో సభ నిర్వహణ సాధ్యమేనా, రాజ్యాంగంలోని 500 సీట్ల పరిమితిని సవరిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీని చిన్న రాష్ట్రాలుగా విభజించాలనే పాత ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన లేదు.

By:  Satya P   |   28 Nov 2026 6:00 PM IST
డీలిమిటేషన్...యూపీని రెండు ముక్కలు చేయాల్సిందే !
X

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అన్నది తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అది కూడా పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ ని విడగొట్టిన తరువాత ఇంత పెద్ద నంబర్ అన్న మాట. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారితే కనుక మరో సగం సీట్లు జత అవుతాయి. అవీ ఇవీ కలిపిస్తే యూపీలో టోటల్ గా 605 అసెంబ్లీ సీట్లు అవుతాయని అంచనా కడుతున్నారు. అయితే యూపీ అసెంబ్లీలో సీట్ల గరిష్ట పరిమితిని 500 సీట్ల నుంచి 650 సీట్ల దాకా పెంచాలని తాజాగా కేబినెట్ ఆమోదించిన బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది అని అంటున్నారు. అంటే బాహుబలి అసెంబ్లీ అన్న మాట. ఇంత పెద్ద నంబర్ తో అసెంబ్లీని నడపడం అన్నది సాధ్యపడుతుందా అన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న చర్చగా ఉంది.

రాజ్యాంగం ఏమి చెబుతోంది :

ఇదిలా ఉంటే రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ శాసనసభ అయినా 500 కి మించి సీట్లు ఉండడానికి వీలు లేదు. నియోజకవర్గాల పునర్విభజన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే వరకు సీట్ల సంఖ్యను స్థిరంగా ఉంచారు. ఒకవేళ భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాల్సి వస్తే 500 పరిమితిని మార్చడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి డీలిమిటేషన్ తో రాజ్యాంగ సవరణ చేపడుతున్నారు. కానీ ఈ నిబంధనను మారుస్తారా లేదా అన్నది తెలియడం లేదు. ఒక వేళ మారి చేసినా కూడా 600 పై దాటి ఎమ్మెల్యేలు ఉన్న చోట సభను నిర్వహించడం ఎంతో కష్టం అన్నది కూడా రాజ్యాంగ నిపుణులు చర్చిస్తున్నారు. భారీ సంఖ్యలో సభ్యులు ఉన్న అసెంబ్లీని నడపడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అని అంటున్నారు.

రెండుగా విభజిస్తారా :

ఈ నేపథ్యంలో యూపీని రెండుగా విభజిస్తారా అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది. నిజానికి 2020 ప్రాంతంలో యూపీని రెండుగా చేసినపుడు మరో రెండు రాష్ట్రాలుగా చేయాలని కూడా అప్పట్లోనే డిమాండ్ వచ్చింది అని గుర్తు చేస్తున్నారు. ఇలా ఉత్తర ప్రదేశ్ విభజనపై ప్రస్తుత చర్చ మళ్లీ తెరపైకి వచ్చినప్పటికీ, రాష్ట్రాన్ని విభజించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా చర్చ అయితే దీని మీద జరిగింది అయితే లేదు. అయితే యూపీని పూర్వాంచల్, మధ్యాంచల్ , బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించే అవకాశం ఉందన్న ప్రచారం అయితే చాలా కాలంగా సాగుతోంది. అలా జరిగితే చిన్న రాష్ట్రాలలో పాలనాపరంగా అభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని భావిస్తున్న వారు ఉన్నారు.

ఎన్నికలు తరువాతనేనా :

ఇక యూపీలో చూస్తే 2027 మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న 403 అసెంబ్లీ సీట్లతోనే ఈ ఎన్నికలు జరుగుతాయి. మరి డీలిమిటేషన్ అక్కడ అమలు కావాలి అంటే 2032 దాకా వేచి చూడక తప్పదని అంటున్నారు. అప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున సీట్లను పెంచడం ఏ మేరకు సహేతుకమో చూసి మరీ ఈ పెంపు ఉండొచ్చు అని అంటున్నారు. లేదా రాష్ట్రాన్ని విభజించే అవకాశాలను అప్పుడే పరిశీలించే వీలు ఉందని కూడా అంటున్నారు.