Begin typing your search above and press return to search.

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన ఆయన, తాజాగా బెంగళూరులో మెట్రో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో సన్నిహితంగా కనిపించడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన డీకే.. రాజకీయాలు, అభివృద్ధిని వేర్వేరుగా చూడాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

By:  Satya P   |   15 Nov 2026 9:12 AM IST
మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?
X

కాంగ్రెస్ కి దక్షిణాన ద్వారాలు తీసిన వారు డీకే శివకుమార్. ఒక్కసారి 2023 కి ముందు నాటి పరిస్థితులు చూస్తే దక్షిణ భారత దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కనిపించిన పరిస్థితి లేదు. ఏపీలో 2014 లోనే కాంగ్రెస్ ఖతం అయింది. తెలంగాణాలో బీఆర్ఎస్ ఉంది. తమిళనాడులో డీఎంకే ఉంది. కేరణలో కమ్యూనిస్టుల పాలన ఉంది. కర్ణాటకలో బీజేపీ ఉంది. అలాంటి చోట హస్తాన్ని బలోపేతం చేసి కాంగ్రెస్ కి తొలి అధికారం తెచ్చిన వారుగా ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివ కుమార్ ని అంతా చూస్తారు. ఆయన ఎంతో కృషి చేసి సాధించిన అధికారమే ఇపుడు పక్క రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పవర్ కి దీపాలు వెలిగించింది అని చెప్పాలి.

ట్రబుల్ షూటర్ గా :

ఇక డీకే శివ కుమార్ ని అంతా ట్రబుల్ షూటర్ గా అభివర్ణిస్తారు. పార్టీలో సమస్య ఎక్కడ ఉన్నా సరే పరిష్కారం చూపేది మాత్రం డీకే అన్న ముద్ర ఆయన మీద ఉంది. ఆయన ఆర్థికంగానూ బలవంతుడు, వ్యూహ చతురుడు. అందుకే జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆయనను ఈ రోజున కాంగ్రెస్ సీఎం గా కర్ణాటకలో చేసింది. ఇక డీకే కూడా కాంగ్రెస్ కి ఏమీ తక్కువ చేయలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసి తెప్పించారు. అలాగే కేరళలో కూడా కాంగ్రెస్ కి అన్ని విధాలుగా శక్తి యుక్తులు అందించారు అని చెబుతారు. రాహుల్ తో సోనియా గాంధీతో పాటు ప్రియాంకా గాంధీతోనూ ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే డీకే మీద ఇపుడు పెద్ద చర్చ సాగుతోంది. దానికి కారణం తాజాగా ఆయన వ్యవహరించిన తీరు అని అంటున్నారు.

మోడీతో వెరీ క్లోజ్ గా :

ఒక వైపు ఉప్పూ నిప్పులా కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ సమరం కేంద్ర స్థాయిలో సాగుతోంది. మోడీని ప్రతీ రోజూ రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం పింక్‌లైన్‌ మెట్రో ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో శివకుమార్‌ వేదిక పంచుకున్నారు. అంతే కాదు వెరీ క్లోజ్ గా కూడా ఆయన కనిపించారు. ఇద్దరూ వేదిక మీద పక్క పక్కన కూర్చుని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడటం అన్నది రాజకీయంగా ఇపుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.

జస్ట్ కోపరేషన్ :

అయితే దీనిని డీకే శివ కుమార్ తనదైన వివరణతో లైట్ తీసుకోమంటున్నారు. కేంద్రం అన్న తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాల్సి ఉంటుంది కదా అని ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంతే కాదు అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక తనకు ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం మీద ఆయన స్పందిసూ రాజకీయాలను అభివృద్ధిని వేర్వేరుగా చూడాలని ఒక్క మాటతో తేల్చేశారు. తాను ప్రధాని తో మాట్లాడింది అంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నారు. కర్ణాటకకు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను ప్రస్తావించానని వెల్లడించారు. రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

సహకరించుకోవాల్సిందే :

రాజకీయాలు వచ్చినపుడు పోటీ పడాల్సిందే అని డీకే అన్నారు. అదే అభివృద్ధి విషయం వచ్చినపుడు తప్పకుండా సహకరించుకోవాల్సిందే అని అన్నారు. ఇది తన స్పష్టమైన విధానం అని దీని మీద ఎవరికి నచ్చినట్లుగా వారు అర్ధం చేసుకుంటే చేసుకోవచ్చు అని కూడా డీకే అన్నారు. ఇక తాను మోడీని కోరింది కూడా కర్ణాటకలోని మేకెదాటు ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని అని చెప్పారు. అలాగే డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్ల నిర్మాణంపైనా మోదీతో చర్చించినట్లు చెప్పారు. మొత్తం మీద కాంగ్రెస్ లో డీకే అనుమానం మేఘాలు సృష్టించారా లేక ఆయన చెప్పినట్లుగా కోపరేషన్ తోనే సాగుతున్నారా అంటే ఆయన చెప్పినట్లుగానే ఎవరికి నచ్చినట్లుగా వారు అర్థం చేసుకోవాల్సిందే.