ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు సరిపోలేదు.. కట్ చేస్తే?
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన మున్నా అలియాస్ ముస్తాకా గుల్షన్ అనే వ్యక్తి సుమన్ దేవి అనే వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు
By: Garuda Media | 24 March 2026 1:00 PM ISTకొందరి కక్కుర్తి గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఒక మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా వెలుగు చూసిన వివరాలు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా మారాయి. దీనికి కారణం.. హత్యకు గురైన వ్యక్తి కక్కుర్తి మరీ ఇంత దారుణమా? అన్నట్లు ఉండటమే. హతుడికి అప్పటికే ఇద్దరు భార్యతలతో పాటు పద్దెనిమిది మంది సంతానం ఉన్నప్పటికీ.. సరిపోదన్నట్లు మరో మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన మున్నా అలియాస్ ముస్తాకా గుల్షన్ అనే వ్యక్తి సుమన్ దేవి అనే వివాహితతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే.. ఆమెను బలవంతంగా వివాహేతర సంబంధంలోకి లాగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తరచూ కలవాలని వేధింపులకు దిగటంతో విసిగిపోయిన మహిళ.. తన సోదరుడితో కలిసి మున్నాను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
తాము వేసుకున్న పథకంలో భాగంగా మార్చి 18న మున్నాను ఇంటికి ఆహ్వానించిన సదరు మహిళ.. అతడు ఇంట్లోకి అడుగు పెట్టినంతనే మహిళ సోదరుడు..అతడి స్నేహితులు వెనుక నుంచి ఇనుపరాడ్లతో దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం డెడ్ బాడీని గోనెసంచెలో కుక్కి పంటకాలువలో పడేశారు. మున్నా కనిపించకపోవటంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మున్నా ఫోన్ కాల్ ఆధారంగా సదరు మహిళను గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అనంతరం పంట కాలువ నుంచి మున్నా డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపారు. మున్నాకు ఇద్దరు భార్యలని.. ఒక్కొక్కరికి తొమ్మిది మంది చొప్పున సంతానం ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇద్దరు భార్యలు.. పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నప్పటికి మరో మహిళను వేధింపులకు దిగిన వైనం షాకిచ్చేలా మారింది.
