Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్... రూ.15 లక్షల చొప్పున 15 మంది పిల్లలు!

అవును... చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్.ఓ.టీ పోలీసులు అరెస్టు చేశారు.

By:  Raja Ch   |   25 Dec 2025 1:00 AM IST
హైదరాబాద్  లో చైల్డ్  ట్రాఫికింగ్... రూ.15 లక్షల చొప్పున 15 మంది పిల్లలు!
X

తెలంగాణ రాష్ట్రంలో శిశువులను విక్రయిస్తున్న ఓ అధునాతన అంతర్రాష్ట్ర సిండికేట్ ను తెలంగాణలోని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్.ఓ.టీ) పోలీసులు ఛేధించారు. వీరి చేతుల్లో పడిన పిల్లల్లో రోజుల వయసున్న పసి కందులు కూడా ఉన్నారని.. అరెస్టైన వారిపై గతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాంటి అనేక కేసులు నమోదయ్యాయని చెబుతూ ఈ ముఠాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు మాదాపూర్ డీసీపీ రితు రాజ్!

అవును... చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్.ఓ.టీ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా... గుజరాత్‌ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌, మంచిర్యాలలో విక్రయించారని తెలిపారు. ఈ సమయంలో ఈ ముఠాకు చెందిన 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ముఠానుంచి ఇద్దరు పసికందులను కాపాడినట్లు తెలిపారు.

ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్ నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్నారని డీసీపీ రితు రాజ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక్కో శిశువు అమ్మకం వెనుక సుమారు రూ.15 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతాయని అన్నారు. అయితే.. ఇందులో రూ.3 నుంచి రూ.4 లక్షలు మాత్రమే శిశివు తల్లి తండ్రులకు అందుతాయని చెప్పారు! ఈ సమయంలో దత్తత చట్టబధంగా కనిపించేలా నైకిలీ పత్రాలను అందించేవారని పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. ఈ రాకెట్టు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిందని.. ఈ క్రమంలో నిందితులు ఎనిమిది వేర్వేరు ఆసుపత్రుల్లోని సిబ్బంది, మధ్యవర్తులతోనూ సంబంధాలను ఏర్పరచుకున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరు ఆర్ధికంగా బలహీనంగా ఉన్న జీవసంబంధమైన తల్లితండ్రులను లక్ష్యంగా చేసుకుని.. అనంతరం ఆ బిడ్డలను ధనవంతులైన కొనుగోలుదారులకు విక్రయించారని తెలిపారు.

ఈ క్రమంలో.. ఒక్కో శిశువును సుమారు రూ.15 లక్షలకు అమ్మేశారని.. ఈ ముఠా ప్రధానంగా పిల్లలు లేని సంపన్న జంటలను లక్ష్యంగా చేసుకుంటుందని.. అనంతరం, దత్తత చట్టబద్ధంగా కనిపించేలా నకిలీ పత్రాలను అందించేదని తెలిపారు. తాజాగా అరెస్టైన 12 మందిలో కీలక కింగ్ పిన్ లు, అంతర్రాష్ట్ర రవాణాదారులు, స్థానిక ఆసుపత్రి ఆధారిత ఏజెంట్లు ఉన్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో.. సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నారని.. ఇదే సమయంలో ఈ ముఠాకు సహాయం చేసిన ఇతర వైద్య నిపుణులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతర పిల్లలను గుర్తించడానికి తాము గుజరాత్ పోలీసులతో కలిసి పనిచేస్తునామని పోలీసులు తెలిపారు!