Begin typing your search above and press return to search.

ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని.. దారుణానికి ఒడిగట్టిన కూతురు!

వివరాళ్లోకి వెళ్తే... వికారాబాద్‌ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ.. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. కాలక్రమేణా ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

By:  Raja Ch   |   28 Jan 2026 7:09 PM IST
ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని.. దారుణానికి ఒడిగట్టిన కూతురు!
X

కంటే కూతుర్నే కనాలిరా అంటారు.. కూతురు ఉంటే అటు తల్లికి శారీరకంగా, ఇటు తండ్రికి మానసికంగా కొండంత అండ అని చెబుతారు. అయితే.. చాలా మంది కూతుర్లు ఒకెత్తు, తాను మరొకెత్తు అన్నట్లుగా నిలిచింది సురేఖ! రోజు రోజుకీ పతనమైపోతున్న మానవ సంబంధాల పతనాన్ని మరింత బలంగా చూపించింది! తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కారణంతో వారిని తనకు తెలిసిన విద్యతో మట్టుబెట్టింది. ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... రోజురోజుకూ అథఃపాతాళానికి పడిపోతున్న మానవ సంబంధాలను మరింత కిందకి తొక్కేసే ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఆన్ లైన్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమ పెళ్లి కోసం కని, పెంచిన తల్లి తండ్రులను కడ తేర్చింది.. వారిది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే.. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం తెరపైకి వచ్చింది. దీంతో.. అంతా ఒక్కసారిగా షాకైపోయారు!

వివరాళ్లోకి వెళ్తే... వికారాబాద్‌ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ.. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. కాలక్రమేణా ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సంబంధానికి ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ వివాహానికి అంగీకరించేది లేదని చెప్పారని తెలుస్తోంది.

ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో సురేఖ.. తన తల్లితండ్రులపై పీకల్లోతు కక్ష పెంచుకుంది! ఈ క్రమంలోనే వారిని హత్య మార్చాలని ఫిక్సయ్యింది. ఈ క్రమంలో వృత్తి రీత్యా నర్సు అయిన సురేఖ.. తల్లితండ్రులకు ఒళ్లు నొప్పుల మందు అని చెప్పి అనస్థీషియా సమయంలో ఇచ్చే మందు ఓవర్ డోస్ ఇచ్చింది. దీంతో.. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే ఇద్దరూ మృతి చెందారు. దీంతో.. తన అన్నయ్యకు కాల్ చేసింది సురేఖ. తల్లితండ్రులు ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నారని తెలిపింది!

దీంతో అతడు హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా తల్లితండ్రులు ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఓ పక్క చెల్లి ప్రేమ వ్యవహారం, ఫలితంగా ఇంట్లో జరుగుతున్న గొడవలు.. ఇదే సమయంలో తల్లితండ్రులిద్దరూ ఒకేసారి మరణించడంతో ఆమె అన్నయ్యకు అనుమానమొచ్చింది. దీంతో... ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు! దీంతో.. రంగలోకి దిగిన పోలీసులు సురేఖను తమదైన శైలిలో విచారించడంతో.. ఆమె నేరాన్ని అంగీకరించింది!

ఇందులో భాగంగా... తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే తల్లిదండ్రులను హత్య చేసినట్లు సురేఖ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు! ఈ సమయంలో.. సురేఖను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె ప్రియుడి పాత్రపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు!