Begin typing your search above and press return to search.

అడవిలో అత్యాచారం.. ఆపై హత్య.. సాక్ష్యాలు లేని కేసు ఎలా ఛేదించారంటే..

కాలకృత్యాలు తీసుకోడానికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె కోసం చుట్టుపక్కల తల్లిదండ్రులు గాలించగా, 14వ తేదీన అడవిలో మృతదేహం లభించింది.

By:  Tupaki Political Desk   |   22 March 2026 5:00 PM IST
అడవిలో అత్యాచారం.. ఆపై హత్య.. సాక్ష్యాలు లేని కేసు ఎలా ఛేదించారంటే..
X

ఆధారాలు లేని ఓ హత్యాచారం కేసును తమిళనాడు పోలీసులు ఛేదించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పది రోజుల్లోనే నిందితుడిని గుర్తించడం ఈ కేసులో విశేషంగా చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం, ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెను సవాల్ గా మారింది. ఇక ఎన్నికల వేళ ఈ కేసు రాజకీయ వివాదంగా మారకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. పది రోజులు అవిశ్రాంతంగా పనిచేసి కేసును కొలిక్కి తీసుకువచ్చారు.

తమిళనాడులోని తూత్తుకూడిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ అఘంతకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ నెల 10న ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత యువత ఇంటి నుంచి అదృశ్యమైంది. రెండు రోజుల తర్వాత సమీపంలో ఉన్న అడవిలో ఆమె మృతదేహం లభించడం సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఈ కేసు విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు ఇంటి వద్ద ఉన్న యువతిని అపహరించి హత్య చేయడం, అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది.

కాలకృత్యాలు తీసుకోడానికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె కోసం చుట్టుపక్కల తల్లిదండ్రులు గాలించగా, 14వ తేదీన అడవిలో మృతదేహం లభించింది. అయితే ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పది రోజుల్లో నిందితుడుని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేనిచోట కేసును రికార్డు సమయంలో పరిష్కరించారు. ఇందుకోసం పోలీసులు పడిన శ్రమ అభినందనలు అందుకుంటోంది.

హత్య తర్వాత పరారైన నిందితుడు తన కోసం ఎలాంటి సమాచారం లభించకుండా జాగ్రత్త పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కేసు పరిష్కారం కోసం పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇందులో నలుగురు డీఎస్పీలతోపాటు ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు సహా 150 మంది ఉన్నారు. వీరంతా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసు పరిష్కరించారు. దాదాపు 98 సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతోపాటు 2574 సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు.

సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఫింగర్ ప్రింట్ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో జైలు నుంచి బయటకు వచ్చిన పాతనేరస్థుల జాబితాను సేకరించారు. మొత్తం 461 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని అసలు నిందితుడిని గుర్తించారు. ఈ కేసు తమిళనాడు పోలీసుల సామర్థ్యాన్ని ఆవిష్కరించింది. పోలీసులు తలచుకుంటే ఎలాంటి క్లిష్టమైన కేసును అయినా పరిష్కరించగలరని నిరూపించిందని అంటున్నారు.