పెళ్లి కాని ప్రసాదులకు ఇది బిగ్ అలర్ట్ గురూ!
అవును... టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు వివాహ సంబంధాలు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 16 Dec 2025 8:00 PM ISTఎందరో బ్రహ్మచారులు అందరికీ హెచ్చరికలు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైంది. వాస్తవానికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే గతంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు అనే వారు.. ఆ తర్వాత కాలంలో ఆ ఒక తరం బాగుంటే చాలు అనే మాటలు వినిపించాయి.. ఇప్పుడు వధువు/వరుడు కరెక్ట్ అయితే చాలు అనే వరకూ వచ్చిన పరిస్థితి అని అంటారు.
అది కూడా స్లో స్లోగా వెనక్కి వెళ్లిపోతూ.. ఎవరికి వారు ఆన్ లైన్ లో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకుని, ఫోన్ నెంబర్లు మార్చుకుని, చాటింగులు చేస్తూ, మీటింగులకు వెళ్తూ.. వీటికి డేటింగ్ అని పేరుపెట్టి.. అన్నీ అనుకూలంగా జరిగితే వివాహం వరకూ వస్తోన్న పరిస్థితి! అది సక్సెస్ అయినా చాలు, అదే పదివేలు! అయితే ఇప్పుడు అక్కడే అతిపెద్ద సమస్య మొదలైందని చెబుతున్నారు.
అవును... టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు వివాహ సంబంధాలు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్న సంగతి తెలిసిందే. పైగా ఫేస్ టు ఫేస్ కంటే ఫోన్ లోనో, వీడియో కాల్ లోనో మరింత ఓపెన్ గా, ఫ్రీ గా మాట్లాడోచ్చు అని నమ్మే వారు ప్రధానంగా ఈ తరహా పెళ్లి చూపులనే ప్రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్యలు మొదలవుతున్నాయి!
ప్రధానంగా వివాహం చేసుకునే వ్యక్తి (అమ్మాయి/అబ్బాయి) అంటే తెలియకుండానే ఒక నమ్మకం కలగడం సహజం. పైగా.. అవతలి వారు కాస్త బాగా, చనువుగా మాట్లాడితే ఇవతలి వ్యక్తి నమ్మకం మరింత పెరిగిపోతుంది. ఇదే అవతలి వ్యక్తి బలం అవుతుందని అంటున్నారు. ఒకప్పుడు నమ్మిన వ్యక్తికి ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు అడిగేవారు.. దీనికి సంబంధించి పలు కేసులు ఉన్నాయి!
అయితే ఇప్పుడు ఆ లెక్క మారిందని చెబుతున్నారు... "నా ఫోటో పంపుతున్నాను వాట్సప్ లో" అని పంపడం, దానిపై క్లిక్ చేయగానే డబ్బులు వెళ్లిపోవడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పనులు చేసేవారు గరిష్టంగా ఫేక్ ప్రొఫైల్స్ నే పెడుతున్నారని అంటున్నారు. అందువల్ల ఈ విషయం జనాలు జాగ్రత్తగా ఉండాలని.. నమ్మకం పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
