Begin typing your search above and press return to search.

ఆ రిలేషన్ కోసం.. భర్తను.. అత్తను ఏసేసే ప్లాన్ జస్ట్ మిస్

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముదక్ పల్లి గ్రామానికి చెందిన పొట్టేళ్ల సోనీకి వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్తను.. భర్తను అడ్డుతొలగించే దరిద్రపుగొట్టు ప్లాన్ చేసింది.

By:  Garuda Media   |   4 Aug 2026 11:01 AM IST
ఆ రిలేషన్ కోసం.. భర్తను.. అత్తను ఏసేసే ప్లాన్ జస్ట్ మిస్
X

విపరీత మనస్తత్వాల జోరు అంతకంతకూ పెరుగుతోంది. కొత్త సంబంధాలు.. అనాగరిక బంధాల మోజులో పడి సొంతోళ్లను మట్టుబెడుతున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే.. ఈ ఎపిసోడ్ లో లక్కీగా భర్త.. అత్త ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రెండు నిండు ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి వారిద్దరు త్రుటిలో తప్పించుకొని బతికి బట్ట కట్టిన ఉదంతం వెలుగు చూసింది.

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముదక్ పల్లి గ్రామానికి చెందిన పొట్టేళ్ల సోనీకి వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్తను.. భర్తను అడ్డుతొలగించే దరిద్రపుగొట్టు ప్లాన్ చేసింది. ఆగస్టు ఒకటిన తాను వండిన వంటలో గడ్డి మందు కలిపినట్లుగా చెబుతున్నారు. రోజు మాదిరే ఇంట్లో భోజనం చేసిన వారికి.. తిన్న కాసేపటికే వాంతులు.. విరేచనాలు అయ్యాయి. భోజనం చేసే సమయంలో భార్య వడ్డించిన కూరలో కాస్త పురుగుమందు వాసన రావటంతో.. అనుమానం వచ్చింది.

దీంతో.. ఆ భోజనాన్ని పక్కన పెట్టాడు భర్త. అయితే.. అప్పటికే తిన్న ఆహారం కారణంగా అతను.. అతడి తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. చుట్టుపక్కల వారి సాయంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే స్పందించిన అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం చేయటంతో వారిద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో తమపై జరిగిన హత్యాయత్నంపై భర్త.. అత్తలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోని దిగిన ఖాకీలు కిలేడీ భార్యను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్న ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ కు తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చక్కగా సాగుతున్న కాపురాన్ని నిలువునా కూల్చుకోవటం అంటే ఇదేనేమో?