ఫోటోషూట్ మధ్యలో క్రైమ్ ట్విస్ట్.. పెళ్లి కూతురు అరెస్ట్?
పెళ్లి కొడుకుగా ముస్తాబు కావాల్సిన కొడుకు, కాబోయే భార్య చేతిలోనే శవమైపోవడంతో కేతన్ కుటుంబం గుండె పగిలి ఏడుస్తోంది.
By: Madhu Reddy | 23 Jun 2026 9:03 PM ISTమహారాష్ట్రలో జరిగిన ఒక షాకింగ్ మర్డర్ కేస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువ వ్యాపారవేత్త, కొండపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మొదట ఫోటోల కోసం ఫోజులిస్తూ ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ, పోలీసులు జరిపిన లోతైన విచారణలో దీని వెనక కాబోయే పెళ్లికూతురు ఆడిన ఒక ఊహించని క్రైమ్ ట్విస్ట్ బయటపడింది. ఆ నమ్మలేని నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ..
లోహగడ్ కోట దగ్గర దారుణం:
పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ అనే యంగ్ బిజినెస్‌మ్యాన్‌కు, ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. రెండు కుటుంబాల్లోనూ పెళ్లి పనులు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాబోయే భార్యతో కలిసి కేతన్ లోహగడ్ కోటకు ట్రెకింగ్‌కు వెళ్లాడు. ఇక అక్కడ కొండ అంచున నిలబడి సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో ఆయన లోయలోకి పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కాబోయే భర్త చనిపోయాడంటూ ఆ యువతి అప్పట్లో పెద్ద డ్రామానే నడిపింది.
ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్డ్ మర్డర్:
మొదట్లో ఇది కేవలం ఒక ఘోర ప్రమాదమేనని పోలీసులు కూడా భావించారు. కానీ, కేతన్ కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు డిజిటల్ ఆధారాలపై ఫోకస్ పెట్టారు. ఇక కేతన్ కాబోయే భార్య ఫోన్ రికార్డులు, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించగా పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఆ అమ్మాయికి వేరే ఒక యువకుడితో సీక్రెట్ లవ్ అఫైర్ ఉందని, వాళ్లిద్దరూ కలిసి కేతన్‌ను వదిలించుకోవడానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తేలింది.
ప్రియుడితో కలిసి ఘోరం:
పోలీసుల విచారణ ప్రకారం.. ఆ యువతి, ఆమె ప్రియుడు కలిసి కేతన్‌ను తమ ప్రేమకు ఒక అడ్డంకిగా భావించారు. అతడిని ఎలాగైనా చంపేసి, ఆ మరణాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ వేశారు. కోటపై ట్రెకింగ్‌ను అందుకే ఆయుధంగా వాడుకున్నారు. అంతకంటే ముందు కూడా కేతన్‌ను చంపడానికి వాళ్లు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారట. ఇక చివరకు కొండపై నుంచి తోసేసి అనుకున్నది సాధించారు. ప్రస్తుతం పోలీసులు ఆ కిరాతక పెళ్లికూతురిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
పెళ్లి కొడుకుగా ముస్తాబు కావాల్సిన కొడుకు, కాబోయే భార్య చేతిలోనే శవమైపోవడంతో కేతన్ కుటుంబం గుండె పగిలి ఏడుస్తోంది. ఎంతో నమ్మి కోట్లలో ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే, వెనక ఇంత పెద్ద కుట్ర సాగుతోందని వారు ఊహించలేకపోయారు. ప్రేమించిన వాడి కోసం కట్టుకోబోయే భర్తను నమ్మించి చంపిన ఈ ఘరానా పెళ్లికూతురి ఉదంతం విన్నాక.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..
