Begin typing your search above and press return to search.

మొన్న రంఘువంశీ, నిన్న అశోక్, నేడు ఆశిష్.. ఈ భర్తలు చేసిన నేరమేమి..!

అవును... ఇష్టం ఉంటే కలిసి ఉండాలి.. లేని పక్షంలో ఏదో ఒక కారణం చెప్పి విడాకులు తీసుకోవచ్చు! కానీ.. ఏకంగా జీవిత భాగస్వామిని చంపడం, చంపించడానికి సంబంధించిన ఘటనలు ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

By:  Raja Ch   |   6 Feb 2026 11:54 AM IST
మొన్న రంఘువంశీ, నిన్న అశోక్, నేడు ఆశిష్.. ఈ భర్తలు చేసిన నేరమేమి..!
X

ఇటీవల కాలంలో ప్రియుడి మోజులో, అతడితో పాటు అతని స్నేహితుల సహకారంతో కట్టుకున్న భర్తను మట్టుబెడుతున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే! ‘యుద్ధంలో శత్రువుని చంపిన తర్వాత నిద్రపోతారు.. కానీ, పెళ్లైతే శత్రువుతోనే పడుకోవాలి’ అంటూ ఓ సినిమాలో ప్రకాశ్ రాజ్ చెప్పిన సరదా డైలాగ్ ఇప్పుడు మరింతగా సీరియస్ గా చర్చనీయాంశం అవుతుంది. భర్తను భగవంతుడిలా గౌరవించే భార్యలు ఉన్న ఈ దేశంలో ఈ కొత్త సంస్కృతి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!

అవును... ఇష్టం ఉంటే కలిసి ఉండాలి.. లేని పక్షంలో ఏదో ఒక కారణం చెప్పి విడాకులు తీసుకోవచ్చు! కానీ.. ఏకంగా జీవిత భాగస్వామిని చంపడం, చంపించడానికి సంబంధించిన ఘటనలు ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. చంపి డ్రమ్ములో పెట్టి, పైన సిమ్మెంట్ వేసిన వారు ఒకరైతే.. చంపి మూటగట్టుకుని దూరంగా తీసుకెళ్లి పడేసిన వారు మరొకరు! ఇక తాజాగా వైరల్ అవుతున్న మూడు ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

సోనమ్ - రాజా రఘువంశీ!:

గత ఏడాది మే నెలలో మేఘాలయలో సోనమ్ రఘువంశీ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ లో హత్య చేయించిన సంగతి తెలిసిందే. జలపాతం సమీపంలో భర్తను ప్రియుడితో కలిసి ఆమె హత్య చేయించింది! ఇది నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా.. పెళ్లైన కొత్తలోనే, హనీమూన్ కని ఇంట్లో చెప్పి.. మనసులో మాత్రం మరో ప్లాన్ వేసి.. ఇలా కట్టుకున్న భర్తను సోనమ్ అనే మహిళ మట్టుబెట్టింది.

అంజు - ఆశిష్!:

జనవరి 30న రాజస్థాన్ కు చెందిన నూతన దంపతులు ఆశిష్, అంజు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వాహనం వారిని ఢీకొట్టడంతో.. ఆశిష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అంజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే.. తొలుత అంతా దీన్ని హిట్ అండ్ రన్ కేసుగానే భావించగా.. అనంతరం.. ఆశిష్ మరణం ప్రమాదం కాదని.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి అంజూ.. చంపించిందని పోలీసులు గుర్తించారు.

పుష్ప - అశోక్!:

ఈ గ్యాప్ లో జనవరి 24న బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది.. కాకపోతే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా... బెంగళూరుకు చెందిన పుష్ప అనే మహిళ.. ఆమె ప్రియుడు దేవారాజ్ తో కలిసి ఆమె భర్త అశోక్ ని చంపించింది. అశోక్ ని పార్టీకని పిలిచిన దేవరాజ్, అతని స్నేహితులతో కలిసి తలపై గట్టిగా బాదారు. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఈ ప్లాన్ ను మరింత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నట్లుగా... తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ పుష్ప పెర్ఫార్మెన్స్ మొదలుపెట్టిందని చెబుతున్నారు. అయితే.. వైద్య పరీక్షల్లో మాత్రం తలపై వెనుక నుంచి గట్టిగా కొట్టడంతో మృతి చెందినట్లు తేలింది! దీంతో.. పుష్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హత్యలను ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు!:

పైన చెప్పుకున్న ఈ మూడు ఘటనల్లోనూ భార్యలు పక్కా ప్లాన్ తోనే కట్టుకున్న భర్తను హత్యలు చేయించారు. ఈ మూడు సందర్భాల్లోనూ భార్యలకు వాళ్ల వాళ్ల ప్రియుళ్లే సహాయం అందించారు! పైగా... మూడు ఘటనల్లోనూ హత్యలను ప్రమాదాలుగా చిత్రీకరించేలా వ్యూహాలు పన్నడం గమనార్హం. ఇదే క్రమంలో ఈ మూడు కేసుల్లోనూ భార్యలు చెప్పిన వెర్షన్ కు వాస్తవాలకూ పొంతనలేకపోవడం అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి!

అలా అని భర్తలేమీ తక్కువ తినలేదు! వారి చేతుల్లోనూ మరణించిన భార్యలకూ కొదవలేదు! ఇక్కడ ఎవరి చేతుల్లో ఎవరు మరణించారనేదానికంటే ముఖ్యంగా... దాంపత్య జీవితంలో ఇష్టం ఉంటే కలిసి ఉండాలి.. లేకపోతే, విడిపోవాలి తప్ప.. ఇలా హత్యలకు ఆలోచించడం సరైంది కాదని.. దాంపత్య జీవితంలో ఇలాంటి ఆలోచనలు భవిష్యత్తులో వివాహ వ్యవస్థపై కొత్త కొత్త సందేహాలు, భయాలను మరింతగా పెంచుతాయని అంటున్నారు!