Begin typing your search above and press return to search.

సైకో సినిమాల్లోనూ ఇలాంటి హింసను చూసి ఉండరు

యువకుల్ని హనీట్రాప్ చేస్తున్న ఈ సైకో జంటను తాజాగా కేరళ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

By:  Garuda Media   |   15 Sept 2025 2:00 PM IST
సైకో సినిమాల్లోనూ ఇలాంటి హింసను చూసి ఉండరు
X

థ్రిల్లర్ మూవీలు.. అందునా సైకోలు చేసే అరాచకాలకు సంబందించిన సినిమాలు చాలానే చూసి ఉంటారు. రీల్ లోనూ టచ్ చేయని దారుణ పనులకు ఈ రియల్ ఉదంతం నిలుస్తుంది. కేరళలో వెలుగు చూసిన సైకో జంట వికృత పోకడల గురించి తెలిస్తే ఒళ్లు జలదరించాల్సిందే. యువకుల్ని హనీట్రాప్ చేస్తున్న ఈ సైకో జంటను తాజాగా కేరళ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

విచారణ వేళ.. వారు వెల్లడించిన వివరాలు తెలిస్తే షాక్ తినాల్సిందే. పతనంతిట్టకు చెందిన జయేష్.. రష్మీలు దంపతులు. పది రోజుల క్రితం ఒక యువకుడి ప్రేమపేరుతో మాయమాటలు చెప్పిన రష్మీ అతడ్ని ఇంటికి ఆహ్వానించింది. దీంతో. వెనుకా ముందు చూసుకోకుండా అతగాడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత కానీ అతగాడికి అర్థంకాలేదు. తాను ఒక సైకో జంట ట్రాప్ లో చిక్కుకున్నట్లు.

అప్పటికే ఆలస్యమైంది. సదరు యువకుడికి బతికి ఉండగానే నరకం ఎలా ఉంటుందో చూపించారు. అతడ్ని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అది కూడా అలా ఇలా కాదు. వైర్లతో కొట్టటం.. పెప్పర్ స్ప్రేతో దాడి చేయటమే కాదు.. గోళ్లను తొలగించి దారుణాలకు పాల్పడ్డారు. అక్కడితో వారి కసి తీరలేదు.

అతడి జననాంగాలపైనా దాడి చేశారు. ఇలాంటి దారుణాలు వీరికి కొత్త కాదు. మరో యువకుడి మీదా ఇదే తరహాలో దాడి చేయటంతో అతగాడు కంటిచూపును కోల్పోయిన వైనాన్ని గుర్తించారు. ఈ సైకో జంట చెర నుంచి బయటపడిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించటంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. విచారణ వేళ.. షాకింగ్ ఉదంతాలు వెలుగు చూశాయి. వీరిని మరింత లోతుగా విచారిస్తే.. వీరి చేతిలో నరకాన్ని చూసిన బాధితుల వివరాలు మరిన్ని వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. వీరి వ్యవహారం స్థానికంగా పెను సంచలనంగా మారింది.