Begin typing your search above and press return to search.

డ్ర*గ్స్ అడిక్టుల మధ్య గొడవ.. పునరావాస కేంద్రంలో మర్డర్

తాజాగా అలాంటి సెంటర్ లో జరిగిన గొడవలో ఒకరిని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   25 Sept 2025 9:28 AM IST
డ్ర*గ్స్ అడిక్టుల మధ్య గొడవ.. పునరావాస కేంద్రంలో మర్డర్
X

హైదరాబాద్ మహానగరంలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం విస్తుపోయేలా ఉంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిపోయిన వైనం పలుమార్లు పోలీసులు చేస్తున్న దాడుల్లో బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. డ్రగ్స్ బారిన పడినోళ్లను.. ఆ మహమ్మారి నుంచి దూరం చేసేందుకు.. వారిని మామూలు మనుషులుగా తయారు చేసేందుకు కొన్నిడీఅడెక్షిన్ సెంటర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

తాజాగా అలాంటి సెంటర్ లో జరిగిన గొడవలో ఒకరిని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన మియాపూర్ లోని రఫా పునరావాస కేంద్రంలో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. అతను ఎనిమిది నెలలుగా.. ఈ డీఅడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే సెంటర్ లో మరికొందరు కూడా చికిత్స తీసుకుంటున్నారు.

ముప్ఫై తొమ్మిదేళ్ల సందీప్ మాదిరి.. నల్గొండకు చెందిన ఆదిల్.. బార్సాస్ కు చెందిన సలేమాన్ లు కూడా ఈ పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి ఈ ముగ్గురి మద్య గొడవ జరిగింది. సందీప్ పై ఆదిల్.. సులేమాన్ లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సందీప్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఈ సమాచారం పోలీసులకు అందటంతో వారు ఆదిల్.. సులేమాన్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒక పునరావాస కేంద్రంలో గొడవ జరిగి.. హత్యకు గురి కావటం లాంటి ఘటనలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.