Begin typing your search above and press return to search.

షాకింగ్... భార్యను చంపి, మంచం కిందే పూడ్చిపెట్టి, దానిపైనే నిద్ర!

అవును... తన భార్యను వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహంపైనే దాదాపు 12 రోజుల పాటు నిద్రించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

By:  Raja Ch   |   24 Oct 2025 3:14 PM IST
షాకింగ్... భార్యను చంపి, మంచం కిందే పూడ్చిపెట్టి, దానిపైనే నిద్ర!
X

దాంపత్య జీవితంలో అనుమానం అనేది పెను భూతం అని అంటారు. సక్రమంగా సాగుతున్న జీవితంలో వివాహేతర సంబంధాలు, తమ భాగస్వామికి అవి ఉన్నాయేమో అనుమానాలు ఎన్నో ఘోరాలకు దారితీస్తుంటాయి. ఈ క్రమంలో తన భార్యపై అదే అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహంపైనే చాలా రోజులు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

అవును... తన భార్యను వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహంపైనే దాదాపు 12 రోజుల పాటు నిద్రించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని 48 ఏళ్ల హరికృష్ణన్ గా గుర్తించారు. ఇతడు హర్యానాలో కూలీగా పనిచేసేవాడని చెబుతున్నారు. వాస్తవానికి అతని సొంత ఊరు ఉత్తరప్రదేశ్ లో ఉంది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రైచ్ జిల్లాలో హరికృష్ణన్ అనే వ్యక్తి తన భార్యను వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసి, ఆ తర్వాత ఆమె మృతదేహంపైనే సుమారు 12 రోజుల పాటు నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు హర్యానాలో కూలీగా పనిచేస్తూ, ఇటీవల తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అతడు తిరిగి వచ్చిన కొద్దిరోజులకే అతని భార్య ఫూలా దేవి (45) అదృశ్యమైంది.

తన సోదరి జాడ తెలియకపోవడంతో ఫూలాదేవి సోదరుడు తీవ్ర ఆందోళన చెంది అక్టోబర్ 13న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ సమయంలో పూలాదేవి సోదరుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతనికి ఓ విస్తుపోయే దృశ్యం కనిపించింది. అదే... హరికృష్ణన్ మంచం కింద తవ్విన మట్టి కనిపించింది.

దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. మంచం కింద తవ్వకాలు జరపగా.. సుమారు 6 అడుగుల లోతులో ఫూలాదేవి కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు ఈ మిస్సింగ్ కేసును, హత్య కేసుగా మార్చారు. అప్పటికే పారిపోయిన హరికృష్ణన్ కోసం గాలింపు చేపట్టారు.

ఈ నేపథ్యంలో... పక్కనే ఉన్న బారాబంకి జిల్లాలోని దుర్గాపూర్ తపేశి గ్రామంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో హరికృష్ణన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో... తాను హర్యానా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భార్య ఫూలాదేవిని ఒక గ్రామస్థుడైన గుడ్డుతో అభ్యంతరకరమైన స్థితిలో చూసినట్లు తెలిపాడు.

ఈ సమయంలో.. తీవ్ర ఆగ్రహానికి లోనై, ఆమెను చంపేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని తన గదిలోని పాతిపెట్టినట్లు వెల్లడించాడు. అప్పటి నుంచి ఆమె మృతదేహం ఉన్న చోటుపైనే నిద్రిస్తున్నట్లు తెలిపాడని తెలుస్తోంది!