Begin typing your search above and press return to search.

ప్రియుడితో ప్లాన్ చేసి భర్తను చంపించింది.. గుంటూరు మహిళ దారుణం

భర్తల్ని టార్గెట్ చేసి.. ప్రియుడితో ప్లాన్ చేసి హత్యలు చేయించే భార్యల సిరీస్ లో మరో దారుణం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   1 Oct 2025 12:22 PM IST
ప్రియుడితో ప్లాన్ చేసి భర్తను చంపించింది.. గుంటూరు మహిళ దారుణం
X

భర్తల్ని టార్గెట్ చేసి.. ప్రియుడితో ప్లాన్ చేసి హత్యలు చేయించే భార్యల సిరీస్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఇందుకు గుంటూరు పట్టణం వేదికైంది. గుంటూరుకు చెందిన మహిళ ఒకరు భర్తతో విడిగా ఉంటూ.. అతడి ఆస్తి మీద కన్నేసి.. ప్రియుడితో ప్లాన్ చేసి హత్య చేయించిన వైనం.. రివర్సులో వారిద్దరూ కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది. ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసి.. తాము అనుకున్నది పూర్తైన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించనట్లుగా ప్రచారం చేసినప్పటికీ.. పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ ఉదంతంలో ముగ్గురిని అరెస్టుచేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

సత్తెనపల్లికి చెందిన లక్ష్మీకి పదిహేనేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలంలోని పెదపలకలూరుకు చెందిన ఆటోడ్రైవర్ గోవిందరాజుతో పెళ్లైంది. మద్యానికి బానిసైన భర్త వేధిస్తున్నాడంటూ ఆరేళ్లుగా విడిగా ఉంటోంది. సత్తెనపల్లిలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఉంటోంది. అయితే.. భర్తకు కోటిన్నర రూపాయిల విలువైన ఇళ్లు.. స్థలాలు ఉన్నాయని.. అతడ్ని హత్య చేస్తే ఆస్తి మొత్తం తనకే చెందుతుందని.. అప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చని పేర్కొంటూ ప్రియుడు వెంకట్ ను ఒప్పించింది.

ఈ నేపథ్యంలో తన స్నేహితుడు షేక్ ఖాసింసైదాతో కలిసి సెప్టెంబరు 18న గోవిందరాజును మద్యం తాగేందుకు వెంకట్ తీసుకెళ్లాడు. ఊరికి దూరంగా మరో ఊరికి తీసుకెళ్లి.. అక్కడ తాగించి.. మద్యం మత్తులో ఉన్న వేళలో మెలతాడును తెంచి మెడకు బిగించారు. బాధితుడు స్ప్రహ తప్పిపోతే.. చనిపోయినట్లుగా భావించారు. ఈ లోపు లక్ష్మి ఫోన్ చేసి..రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించాలని చెప్పింది.

దీంతో గోవిందరాజును ఆటోలో ఎక్కించుకొని కొంతదూరం ప్రయాణించి రోడ్డు పక్కన పడేసి.. అనుమానం వచ్చి బతికి ఉన్న విషయాన్ని గురతించి ఇనుప రాడ్డును గొంతుపై పెట్టి గట్టిగా నొక్కి హత్య చేశారు. సెప్టెంబరు 19న స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే.. మ్రతుని ఫోటోను తెప్పించుకున్న జిల్లా ఎస్పీ హత్యగా అనుమానించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. చివరకు హత్య చేసిన వైనాన్ని గుర్తించారు. దీంతో గోవిందరాజు మరణానికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.