Begin typing your search above and press return to search.

గర్భిణీ స్త్రీ, ఆమె ప్రేమికుడు.. మధ్యలో భర్త... ముగ్గురిలో ఇద్దరు మృతి!

అవును... ఢిల్లీ వీధుల్లో ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో గర్భిణీ స్త్రీ షాలినిపై ఆమె మాజీ లివ్-ఇన్ భాగస్వామి ఆషు కత్తితో పలుసార్లు దాడి చేశాడు.

By:  Raja Ch   |   20 Oct 2025 4:00 AM IST
గర్భిణీ స్త్రీ, ఆమె ప్రేమికుడు.. మధ్యలో భర్త... ముగ్గురిలో ఇద్దరు మృతి!
X

ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తోన్న వివాహేతర సంబంధాలు ఎలాంటి ఘోరాలకు దారితీస్తున్నాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని వీధుల్లో ఓ వివాహేతర సంబంధం ప్రాణాంతకంగా మారింది. గర్భిణీ స్త్రీని ఆమె భర్తతో పాటు ఆమె ప్రేమికుడు పొడవగా.. భార్యను కాపాడుకునే ప్రయత్నంలో అతడిని ఆమె భర్త పొడిచాడు.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

అవును... ఢిల్లీ వీధుల్లో ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో గర్భిణీ స్త్రీ షాలినిపై ఆమె మాజీ లివ్-ఇన్ భాగస్వామి ఆషు కత్తితో పలుసార్లు దాడి చేశాడు. తొలుత ఆషు.. ఆకాష్ ను పొడిచి చంపడానికి ప్రయత్నించాడు.. ఆకాష్ మొదటి దెబ్బను తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత ఇ-రిక్షాలో కూర్చున్న షాలినిని అషు పలుసార్లు పొడిచాడు.

అలా దాడి చేస్తున్న అషు ఆగకపోవడంతో.. అతడి చేతిలోని కత్తిని బలవంతంగా లాక్కొన్న ఆకాష్... అతడిని కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో... షాలిని, ఆషు ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అక్కడికి చేరుకునేలోపే మరణించారని వైద్యులు ప్రకటించారు. ఆకాష్ ప్రస్తుతం కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్నాడు. పోలీసులు బీ.ఎన్.ఎస్. సెక్షన్ 103(1), 109(1) కింద కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన డీసీపీ... 'శనివారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో ఆకాష్, షాలిని దంపతులు కుతుబ్ రోడ్డులో తన తల్లి షీలాను కలవడానికి వెళుతుండగా... ఆషు అకస్మాత్తుగా అక్కడికి చేరుకుని ఆకాష్‌ పై కత్తితో దాడి చేశాడు' అని తెలిపారు. ఈ హింసతో ఆందోళన చెందిన స్థానికులు.. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన షాలిని తల్లి షీలా.. తన కూతురు గర్భవతి అని అధికారులకు చెప్పారు. అయితే.. పుట్టబోయే బిడ్డ పితృత్వంపై వివాదం ఉందని.. ఇందులో భాగంగా.. ఆషు తానే పుట్టబోయే బిడ్డకు తండ్రినని చెప్పుకుంటున్నాడని.. అయితే ఆకాష్ దీనికి అంగీకరించలేదని.. ఈ విభేదం ఇద్దరి మధ్య ఈస్థాయి ఘర్షణలకు దారితీసిందని వెల్లడించారు!

అయితే... అషు, ఆకాష్ ఇద్దరికీ నేరచరిత్ర ఉందని.. వీరిద్దరూ విడి విడిగా ఇప్పటికె పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు! మరోవైపు షాలిని మరణించే సమయానికి ఆమె గర్భవతి అని పోలీసులు తెలిపారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని వెల్లడించారు.