Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News
పట్టుదలకు అత్యాధునిక సాంకేతికత తోడైతే సృజనాత్మక వ్యాపార సామ్రాజ్యాలు ఎలా వికసిస్తాయో నిరూపిస్తూ.. అమెరికా ఆన్‌లైన్ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ రంగంలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. అమెరికాలో ప్రతిష్టాత్మక ఫుడ్ డెలివరీ దిగ్గజం 'డోర్‌డాష్', ప్రముఖ ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ 'ఇన్‌స్టాకార్ట్' ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అంచనాల ప్రకారం సుమారు 17 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.5 లక్షల కోట్లకు పైగా భారీ వ్యయంతో కూడిన ఈ విలీనం గ్లోబల్ డిజిటల్ మార్కెట్లో నూతన శకానికి నాంది పలికింది.
విజన్ , వ్యూహాత్మక అడుగు
ఈ చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 22 నాటి ఇన్‌స్టాకార్ట్ ముగింపు ధర కంటే 26 శాతం అధికంగా అంటే ఒక్కో షేరుకు 65 డాలర్ల చొప్పున నగదు.. స్టాక్ రూపంలో చెల్లించేందుకు డోర్‌డాష్ ముందుకు వచ్చింది. రెస్టారెంట్ ఫుడ్ డెలివరీలో డోర్‌డాష్ సాధించిన అతుటిలేని ప్రజాదరణ.. ఆన్‌లైన్ నిత్యవసరాల విక్రయంలో ఇన్‌స్టాకార్ట్ సంపాదించిన తిరుగులేని నమ్మకం ఒకే వేదికపైకి రావడం ఈ డీల్ యొక్క అసలు సిసలైన ప్రత్యేకత. ఇది కేవలం రెండు సంస్థల విలీనం మాత్రమే కాదు.. అమెజాన్, వాల్‌మార్ట్ వంటి బహుళజాతి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ.. ఒక కొత్త మార్కెటింగ్ వ్యూహంతో ముందడుగు వేయగలమని చాటిచెప్పిన వ్యాపార ధీరత్వం..
వాల్‌మార్ట్, అమెజాన్‌కు గట్టి పోటీ?
ఈ కొనుగోలు వెనుక డోర్‌డాష్ ప్రధాన లక్ష్యం తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవడమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను వినియోగదారులకు చేరవేయడంలో డోర్‌డాష్ బలమైన స్థానాన్ని సంపాదించింది. మరోవైపు ఇన్‌స్టాకార్ట్ ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ మార్కెట్లు, రిటైల్ సంస్థలు, బ్రాండ్లు, వినియోగదారులతో ఇన్‌స్టాకార్ట్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు కలిస్తే ఫుడ్ డెలివరీతో పాటు నిత్యావసర సరుకుల డెలివరీ రంగంలోనూ డోర్‌డాష్ మరింత బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఆన్‌లైన్ గ్రాసరీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన వాల్‌మార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ఒకే డెలివరీ వ్యవస్థ ద్వారా ఆహారం నుంచి కిరాణా సరుకుల వరకు విస్తృత సేవలు అందించే అవకాశాలు ఏర్పడనున్నాయి.
కృషికి లభించిన ప్రతిఫలం : ఇన్‌స్టాకార్ట్ సీఈవో ఆకాంక్ష
ఈ కీలక మైలురాయిపై ఇన్‌స్టాకార్ట్ సీఈవో క్రిస్ రోజర్స్ ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా నిబద్ధతతో శ్రమించిన బృందానికి.. డెలివరీ షాపర్లకు.. నమ్మకమైన రిటైల్ భాగస్వాములకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించడం వల్లే ఈ స్థాయి విజయానికి చేరుకోగలిగామని.. డోర్‌డాష్‌తో కలసి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వినియోగదారులకు సేవల్లో సరికొత్త అనుభూతి
అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తయి.. 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో పూర్తికానున్న ఈ డీల్ ద్వారా కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆహార పదార్థాల నుండి కిరాణా సరుకుల వరకు సమస్తం ఒకే గొడుగు కింద వేగంగా.. పారదర్శకంగా పొందే అవకాశం లభిస్తుంది.
అపారమైన ఆశయాలు.. కఠిన శ్రమ ఉంటే ఎంతటి మహావృక్షాన్నైనా నిర్మించవచ్చని ఈ భారీ విలీనం నిరూపిస్తోంది. కస్టమర్ల డిజిటల్ జీవన విధానాన్ని సులభతరం చేస్తూ.. పారిశ్రామిక రంగానికి ఈ విలీనం ఒక దిశా నిర్దేశక స్ఫూర్తిగా నిలవనుంది.
అయితే ఈ కొనుగోలు పూర్తయ్యే వరకు సేవల ధరలు, ఉద్యోగుల పరిస్థితి, వ్యాపార కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నది స్పష్టత రావాల్సి ఉంది. 17 బిలియన్ డాలర్ల ఈ భారీ ఒప్పందం అమెరికా ఫుడ్, గ్రాసరీ డెలివరీ రంగంలో కొత్త పోటీకి తెరతీయనుంది. డోర్‌డాష్, ఇన్‌స్టాకార్ట్ కలయిక అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజాలకు ఎంతవరకు సవాల్ విసురుతుందో చూడాలి.