Begin typing your search above and press return to search.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బిగ్ విక్టరీ!
By: tupaki | 2025-11-14 07:45:30.0జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యదవ్ ఘన విజయం సాధించారు. ఇందులో భాగంగా బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ ప్రతి రౌండ్ లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రదర్శించారు. దీంతో.. అటు నవీన్ యాదవ్ ఇంటి వద్ద, అటు గాంధీభవన్ లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఈ నేపథ్యంలో సాయంత్రం మంత్రులతో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది!
మరోవైపు... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయిన నేపథ్యంలో నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తాజా ఫలితంపై పార్టీ నాయకులతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.