Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ సంబరాలు స్టార్ట్... ఆసక్తికరంగా ఆరో రౌండ్ అప్ డేట్!

By:  tupaki   |   2025-11-14 05:56:45.0

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రౌండ్ నుంచీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు గాంధీ భవన్ లోనూ సంబరాలు స్టార్ అయిపోయాయి. ఈ క్రమంలో కాసేపట్లో మంత్రులు గాంధీ భవన్ కు చేరుకోనున్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్... అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ వస్తుందని తెలిపారు! మరోవైపు ఆరో రౌండ్ లోనూ నవీన్ యాదవ్ దే పైచేయి అయ్యింది. ప్రస్తుతం ఆయన 15వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు!