Begin typing your search above and press return to search.
నితీశ్ కుమార్ 1 అన్నె మార్గ్ లోనే ఉంటారా?
By: tupaki | 2025-11-14 04:35:48.0బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తన సత్తా చాటుతోంది. ఇందులో భాగంగా.. 150 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈక్రమంలో... నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ 76 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 64 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఆర్జేడీ పార్టీ అభ్యర్థులు 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
లాలూ-రబ్రీ శకం తర్వాత 20 సంవత్సరాల సుదీర్ఘ పాలన అనంతరం తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్ కు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ.
ఈ పరిణామాల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ 1 అన్నే మార్గ్ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదనే చర్చ బలంగా మొదలైంది. కాగా... పాట్నాలోని 1, అన్నే మార్గ్ బీహార్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.