Begin typing your search above and press return to search.
బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ ప్రభావం ఇదే!
By: tupaki | 2025-11-14 04:20:45.0ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్' పార్టీ ఎన్నికల అరంగేట్రంలోనే విఫలమవుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం పీకే పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీహార్ లోని 243 సీట్లలో 239 చోట్ల జన్ సురాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమి ఓట్లను చీల్చడంలో జన్ సురాజ్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగడానికి పీకే పార్టీ ప్రభావం పనిచేసిందని అంటున్నారు. ఇదే సమయంలో.. మహాగఠ్ బంధన్ కూటమిలో ప్రధాన ఆర్జేడీ పార్టీ 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.