Begin typing your search above and press return to search.

మమతా బెనర్జీని వదలని సువేందు అధికారి

By:  tupaki   |   2026-05-04 04:29:26.0

బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ. భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఆధిక్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ నేత సువేందు అధికారి కఠిన పోటీ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు ముందున్నారు.

ఒకప్పుడు మమతా బెనర్జీకి ఆప్తుడిగా ఉన్న సువేందు అధికారి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెకు షాక్ ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఓటమితో సీఎం పదవి కొనసాగాలంటే భవానీపూర్ ఉపఎన్నికల్లో మమత తప్పనిసరిగా గెలవాల్సి వచ్చింది.

ప్రస్తుతం భవానీపుర్‌లోనూ అదే తరహా పోటీ కనిపిస్తుండగా, సువేందు అధికారి మళ్లీ 2021 సన్నివేశాన్ని పునరావృతం చేస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పోటీ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.