బిర్యానీ.. బంగారం.. ఐ ఫోన్స్.. న్యూ ఇయర్ రోజు మన వాళ్ళు ఏం చేశారంటే..!
కొత్త సంవత్సరం 2026కి స్వాగతం చెప్పే సందర్భంలో… 2025 డిసెంబర్ 31 రాత్రి..భారతదేశంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి.
By: Priya Chowdhary Nuthalapti | 2 Jan 2026 12:23 PM ISTకొత్త సంవత్సరం 2026కి స్వాగతం చెప్పే సందర్భంలో… 2025 డిసెంబర్ 31 రాత్రి..భారతదేశంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఈసారి ఎక్కువ మంది బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో..స్నేహితులతో కలిసి కూర్చొని ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకున్నారు. ఈ ట్రెండ్‌ను స్పష్టంగా చూపించింది ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి.
న్యూ ఇయర్ ఈవ్ సాయంత్రం నుంచే ఆర్డర్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బిర్యానీకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. సాయంత్రం 7:30 గంటలకే రెండు లక్షలకు పైగా బిర్యానీ ప్లేట్లు ఆర్డర్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు..బిర్యానీ అంటే ఇండియన్లకు ఎంత ఇష్టమో మరోసారి రుజువయింది అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఏ పండుగైనా, ఏ వేడుకైనా బిర్యానీ లేకుండా పూర్తికాదని మరోసారి నిరూపితమైంది.
బిర్యానీతో పాటు బర్గర్లు కూడా పెద్ద సంఖ్యలో ఆర్డర్ అయ్యాయి. రాత్రి 9:30 గంటల కల్లా 90 వేలకుపైగా బర్గర్లు డెలివరీ అయ్యాయి. అదే సమయంలో కొందరు లైట్ ఫుడ్‌ను కూడా ఇష్టపడ్డారు. ఉప్మా, ఖిచ్డీ..సలాడ్ లాంటి సింపుల్ ఆహారాలను కూడా వేల సంఖ్యలో ఆర్డర్ చేశారు. ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే.. గాజర్ కా హల్వా లాంటి సంప్రదాయ స్వీట్‌కు మంచి డిమాండ్ వచ్చింది. వేల సంఖ్యలో హల్వా ఆర్డర్లు రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొత్త సంవత్సరం అంటే తీపితోనే మొదలవ్వాలనే భావన ఇంకా బలంగా ఉందని ఇది సూచించింది.
ఈసారి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… గిఫ్టింగ్ ట్రెండ్ కూడా ఈ న్యూ ఇయర్ కి బాగా జరిగింది. చాలామంది తమ కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఆహారం, వస్తువులు ఆర్డర్ చేశారు. ముఖ్యంగా ఎక్కువ మంది ఐఫోన్లు.. బంగారం గిఫ్ట్‌గా పంపించారు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మొత్తానికి, ఈ న్యూ ఇయర్ ఈవ్ భారతీయులు ఇంట్లోనే ఉండి..ఆహారం తింటూ.. ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ పంపిస్తూ.. ఆనందంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించారని స్పష్టంగా అర్థమవుతోంది.
