Begin typing your search above and press return to search.

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

అందాల `మ‌ల్లీశ్వ‌రి` క‌త్రిన కైఫ్ స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడి ఇంత‌కుముందే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   13 Oct 2026 9:08 AM IST
UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!
X

అందాల `మ‌ల్లీశ్వ‌రి` క‌త్రిన కైఫ్ స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడి ఇంత‌కుముందే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. మామ్ అయ్యాకా క‌త్రిన త‌న గ్లామ‌ర‌స్ అప్పియ‌రెన్స్ తో హృద‌యాల‌ను గెలుచుకుంటున్నారు. మ‌రోవైపు దీపం ఉండ‌గానే ఎంట‌ర్ ప్రెన్యూర్ గా రాణించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే క‌త్రిన సొంత మేక‌ప్ బ్రాండ్ కే బ్యూటీ ఎంత‌గా పాపుల‌రైందో తెలిసిందే.

ఈ ఉత్ప‌త్తి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు వేసింది. యూకే (UK) మార్కెట్‌లోని వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఈ బ్రాండ్ తాజాగా టిక్‌టాక్ షాప్ లో అధికారికంగా లాంచ్ అయినట్లు సంస్థ ప్రకటించింది. సౌందర్య పోషణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ఆదరణ పొందిన మేకప్ ఉత్పత్తులన్నీ ఇకపై ఒక్కచోటే సులభంగా లభించనున్నాయి.

ఈ చారిత్రాత్మక మైలురాయి గురించి ఆనందాన్ని బ్రాండ్ ఫౌండర్ కత్రినా కైఫ్ స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. యూకే టిక్‌టాక్ కమ్యూనిటీలోకి కే బ్యూటీకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని... ఇది సరికొత్త బ్యూటీ అనుభూతిని పంచుతుందని బ్రాండ్ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా వేదికగా మేకప్ ప్రియులకు సరికొత్త ఫేవరెట్ ప్రొడక్ట్స్‌ను అన్వేషించడానికి ఇది చక్కటి వేదికగా మారుతుందని భావిస్తున్నారు.

యూకేలో దూసుకెళుతున్న బాలీవుడ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్:

కత్రినా కైఫ్‌తో పాటు ప్రియాంక చోప్రా (అనొమలీ - స్కిన్‌కేర్/హెయిర్‌కేర్), ఆలియా భట్ (ఎడ్-ఎ-మమ్మ) వంటి పలువురు ప్రముఖ భారతీయ కథానాయికలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూకే మార్కెట్లో తమ బ్రాండ్స్ - ఉత్పత్తులను విజయవంతంగా విక్రయిస్తున్నారు. బ్రిటన్ మార్కెట్ అత్యధిక కొనుగోలు శక్తి కలిగిన బ్యూటీ, పర్సనల్ కేర్ కాస్మోటిక్ రంగానికి నిలయంగా ఉండటమే కాకుండా.. అక్కడ ఉన్న విశాలమైన దక్షిణాసియా డ‌యాస్పోరా (ఎన్‌ఆర్‌ఐలు) కారణంగా భారతీయ సెలబ్రిటీ బ్రాండ్లకు అపారమైన ఆదాయాన్ని, గుర్తింపును అందిస్తుందనడంలో సందేహం లేదు.

కేవలం సౌందర్య ఉత్పత్తులకే పరిమితం కాకుండా భారతీయ సినీ సెలబ్రిటీలు ఇతర వ్యాపార రంగాలలో ఉన్న అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ-కామర్స్ టెక్నాలజీ, క్లీన్ ఫ్యాషన్, హెల్త్‌కేర్, లైఫ్‌స్టైల్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ .. గ్లోబల్ రియల్ ఎస్టేట్ రౌండ్లలో స్టార్స్ ముమ్మరంగా పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తలుగా తమ ఉనికిని విస్తరిస్తున్నారు.

ఇక బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ .. ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాలు లండన్ కేంద్రంగా భారీ ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఆనంద్ అహుజా నేతృత్వంలోని `షాహి ఎక్స్‌పోర్ట్స్` దుస్తుల ఎగుమతి వ్యాపారంతో పాటు లండన్‌లో `భానీ` ఫ్యాషన్ లేబుల్, స్రీకర్ బోటిక్ `వెజ్‌నాన్‌వెజ్` లాంటి అంతర్జాతీయ లైఫ్‌స్టైల్ బ్రాండ్లను, అలాగే నాటింగ్ హిల్‌లోని కోట్లాది రూపాయల విలాసవంతమైన గ్లోబల్ రియల్ ఎస్టేట్ .. ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.