Begin typing your search above and press return to search.

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

ధనత్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ పండగ వేళ మార్కెట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరగగా, బంగారం, వెండి కొనుగోళ్లకే రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలు వెలువడ్డాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు 20-25 శాతం పెరిగాయి. మరోవైపు మారుతీ సుజుకీ ఒక్కరోజే 30 వేల కార్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది.

By:  A.N.Kumar   |   7 Nov 2026 12:20 PM IST
ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?
X

మనోళ్లకు బంగారం.. వెండి అంటే పంచ ప్రాణాలు.. పసిడి అంటే అది ఒక ఎమోషన్.. ‘షాక్‌ కొట్టేలా ధరలున్నా సరే.. పండగొచ్చిందంటే చాలు షాపుల ముందు క్యూ కట్టాల్సిందే’ అనేది మన భారతీయులు రూపొందించుకున్న రూల్.. దీన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు.. ఈసారి ధనత్రయోదశి కూడా అదే రేంజ్ వినోదాన్ని పంచింది. మార్కెట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగిందట.. ఇందులో కేవలం బంగారం, వెండి కోసమే ఏకంగా రూ. 60 వేల కోట్లు గుమ్మరించేశారంటే మనోళ్ల ధైర్యం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

"అయ్యో మొన్నటిదాకా తులం బంగారం ధర చూసి గుండె పట్టుకున్నారే.. ఇప్పుడేలా కొంటున్నారు?" అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ మనోళ్ల లాజిక్ వేరు.. ధర కాస్త తగ్గడం ఆలస్యం.. "రేపు మళ్ళీ పెరుగుతుందేమో వెంటనే కొనేద్దాం" అని జ్యువెలరీ షాపుల ముందు దండయాత్ర చేశారు. బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందనే నమ్మకంతో పాటు.. జీతం రాగానే ఆన్-లైన్ లో వస్తువులు కార్ట్ చేసుకునే మనవాళ్లకు ఇది పెద్ద కొనుగోలు పండగలా మారిపోయింది.

అయితే ఈ పండగ సెంటిమెంట్ కేవలం పసిడి రాశులకే పరిమితం కాలేదండోయ్... గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనూ అమ్మకాలు 20-25% పెరిగాయంట. "పండగ పూట కొత్త టీవీలో సీరియల్ చూస్తే వచ్చే ఆనందమే వేరు" అనుకున్నారో ఏమో.. హోమ్ అప్లియెన్సెస్ షాపులను కూడా గట్టిగానే ప్లాండర్ చేశారు.

ఇక ఆటోమొబైల్ రంగానికైతే పండగ కటాక్షం గట్టిగానే తాకింది. కొత్త కారు కొని పూజ చేయిస్తే గానీ రోడ్డెక్కలేమని భావించే మనోళ్ల ఉత్సాహాన్ని చూసి కంపెనీలు దండం పెట్టేశాయి. మారుతీ సుజుకీ వాళ్లయితే ఒక్క రోజే 30 వేల కార్లను డెలివరీ చేసి రికార్డు కొట్టేశారు.

ఒకప్పుడు ధనత్రయోదశి అంటే కేవలం కాసుల పేర్లు.. వెండి బిస్కట్లకే పరిమితం. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ మారింది. కార్లు, ఫ్రిజ్లు, ఫోన్లు.. దేనికీ మినహాయింపు లేదు. క్రెడిట్ కార్డుల సైజులు పెరిగినా.. ఈఎంఐల భారం పెరిగినా "సంప్రదాయం ముఖ్యం బిగ్‌ బాస్" అంటూ మన జనాలు చూపించిన ఈ కొనుగోళ్ల జోరును చూసి ఆర్థిక నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. జేబులు ఖాళీ అయినా చేతికి బంగారం.. ఇంటిముందు కారు వస్తే వచ్చే కిక్కే వేరప్పా కదా.. అలా ఉంది మనోళ్ల కొనుగోళ్లు మరీ..