Begin typing your search above and press return to search.

2 నిమిషాల మ్యాగీతో నెలకు 6 లక్షల ఆదాయం.. ఈ కుర్రాడి టాలెంట్ కి ఫిదా!

అందులోనూ పర్వత ప్రాంతంలో చల్లటి వాతావరణంలో మ్యాగీ దొరికితే, ఆ ఆనందం చెప్పక్కర్లేదు.

By:  Madhu Reddy   |   27 Jan 2026 9:00 PM IST
2 నిమిషాల మ్యాగీతో నెలకు 6 లక్షల ఆదాయం.. ఈ కుర్రాడి టాలెంట్ కి ఫిదా!
X

చలికాలంలో వేడి వేడి మ్యాగీ తినటం ఎవరికీ ఇష్టం వుండదు చెప్పండి. అందులోనూ పర్వత ప్రాంతంలో చల్లటి వాతావరణంలో మ్యాగీ దొరికితే, ఆ ఆనందం చెప్పక్కర్లేదు. మరి ఇదే ఫార్ములా పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించటం మీకు తెలుసా ..అవునండి మీరు విన్నది నిజమే. ఈ సింపుల్ లాజిక్‌నే తన వ్యాపార మంత్రంగా మార్చుకున్నాడు కంటెంట్ క్రియేటర్ బాదల్ ఠాకూర్. పర్వతాల పైన ఒక చిన్న స్టాల్‌ను ఏర్పాటు చేసి, మ్యాగీ అమ్ముతూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో కొండంత లాభాలను ఎలా సాధించవచ్చో నిరూపిస్తున్న బాదల్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు యువతకు ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

పర్వతాల పైన మ్యాగీ మ్యాజిక్:

పర్వతాల మీద మ్యాగీ అమ్మడం అనేది చిన్న పనిలా అనిపించినా, దాని వెనుక ఉన్న బిజినెస్ మైండ్ సెట్ గొప్పది. పర్వత ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీని బాదల్ ఠాకూర్ సరిగ్గా వాడుకున్నాడు. కేవలం ఐదు గంటల వ్యవధిలోనే దాదాపు 200 ప్లేట్ల మ్యాగీని విక్రయించి ఆదాయం పొందుతున్నాడు. అక్కడ ఒక ప్లేట్ మ్యాగీ ధర రూ. 70 నుండి రూ. 100 వరకు అమ్ముతున్నాడు. అంటే రోజుకు సుమారు రూ. 21,000 ఆదాయం పొందుతున్నాడు. ఇందులో ఖర్చులు తీసేసినా, రోజుకు కనీసం రూ. 15,000 వరకు లాభం ఉంటుందని అంచనా. ఈ లెక్కన నెలకు దాదాపు రూ. 6 లక్షల వరకు సంపాదిస్తూ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలను మించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ ఎంతటి ఆర్థిక విప్లవాన్ని తెస్తుందో బాదల్ ఆదాయం చూస్తే అర్థమవుతుంది.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం:

యువతకు ఇదొక గొప్ప వ్యాపార పాఠం. ఏదైనా వ్యాపారం చేయాలంటే లక్షలు ఉండక్కర్లేదు, ప్రజల అవసరాన్ని గుర్తిస్తే చాలని బాదల్ నిరూపించాడు. మ్యాగీ తయారీకి కావాల్సిన సామాగ్రి చాలా తక్కువ, అలాగే వండటం కూడా సులభం. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో వేడి వేడి ఆహారం కోసం ప్రజలు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కేవలం మ్యాగీనే కాదు, ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ లేదా లోకల్ టీ పాయింట్లు పర్వత ప్రాంతాల్లో మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

భారీ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోయినా, ప్లానింగ్ , లొకేషన్ సరిగ్గా ఉంటే తక్కువ సమయంలోనే సెటిల్ అవ్వొచ్చని బాదల్ ఉదాహరణ చెబుతోంది. తాను మ్యాగీ అమ్మిన వీడియో ను సోషల్ మీడియా లో పంచుకున్నాడు. ఆ వీడియో చూసిన కొందరు అతని టాలెంట్ ను మెచ్చుకుంటుంటే, కొందరు మాత్రం సాఫ్ట్ వేర్ జాబ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది 2 నిమిషాల మ్యాగీ తో ఇంత లాభమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.