ఆ మీడియా హౌస్ ను సొంతం చేసుకున్న అదానీ
ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. ఇప్పటికే దిగ్గజ వ్యాపారస్తుడిగా వ్యవహరిస్తున్న అదానీ కొంత కాలం క్రితమే మీడియా రంగంకి అడుగు పెట్టటం తెలిసిందే.
By: Garuda Media | 24 Jan 2026 10:25 AM ISTరోటీన్ కు భిన్నమైన కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. మిగిలిన రంగాలకు భిన్నంగా మీడియా సంస్థల వ్యాపారం ఉంటుంది.
ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. ఇప్పటికే దిగ్గజ వ్యాపారస్తుడిగా వ్యవహరిస్తున్న అదానీ కొంత కాలం క్రితమే మీడియా రంగంకి అడుగు పెట్టటం తెలిసిందే. ఆయన చేతిలో ఇప్పటికే ఎన్డీటీవీ, బీక్యూ ప్రైమ్ లలోనూ వాటాల్ని కొనుగోలు చేసి..ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అదానీ తాజాగా మరో పెద్ద మీడియా సంస్థను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మరింది.
ఇంతకూ ఆ సంస్థ ఏదంటారా? అక్కడికే వస్తున్నాం. దేశీయంగా వివిధ బాషలకు చెందిన న్యూస్ ఏజెన్సీగా సపరిచితమైన ఐఏఎన్ఎస్ ప్రింట్.. డిజిటల్, బ్రాడ్ క్యాస్ట్ ఫ్లాట్ఫామ్స్ కు వార్తలు అందించే ఏజెన్సీగా ఉంటే ఈ సంస్థను అదానీ గ్రూపు పూర్తిగా సొంతం చేసుకుంది. 2023 డిసెంబరులో అదానీ గ్రూపు ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో 50.5 శాతం వాటాను కొనుగోలు చేసింది.
దీంతో న్యూస్ వైర్ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకున్న అదానీ గ్రూపు 2024 జనవరిలో వాటాను పెంచుకుంది. దీంతో ఏఎంజీ మీడియా 76 వాతం వోటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా 24 శాతం వాటాను సొంతం చేసుకోవటానికి అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవటంతో ఈ సంస్థ ఇప్పుడు అదానీ గ్రూపులో ఒక అనుబంధ సంస్థగా మారనుంది. ఇది అదానీ ఎంటర్ ప్రైజస్ లో భాగంగా మారినట్లైంది.
ఇంతకాలం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూపు అతి తక్కవ వ్యవధిలో ఎంతలా విస్తరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గ్రూపు మీడియా, కంటెంట్ ఎకోసిస్టమ్ లో తానో బలమైన శక్తిగా మారిందని చెప్పాలి. దీంతో బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ వరకు అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించినట్లుగా చెప్పక తప్పదు.
