Begin typing your search above and press return to search.

కింగ్డమ్: 24 గంటల్లో బుకింగ్స్ ఎలా ఉన్నాయ్ అంటే

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.

By:  M Prashanth   |   1 Aug 2025 10:59 AM IST
కింగ్డమ్: 24 గంటల్లో బుకింగ్స్ ఎలా ఉన్నాయ్ అంటే
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామా నిన్న గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా విడుదలకు ముందు నుంచి ట్రైలర్, సాంగ్స్‌కు వచ్చిన స్పందన, ప్రమోషన్లతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, బుకింగ్స్ మాత్రం తగ్గకుండా హై స్పీడ్లో కొనసాగుతున్నాయి.

సాలీడ్ బుకింగ్స్.. కొత్త రికార్డ్!

విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 2,21,450 టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్ మై షోలో ఒక్క రోజులో ఇంత భారీ టికెట్లు అమ్ముడవ్వడం తాజా రికార్డుగా నిలిచింది. ఈ బుకింగ్స్ స్పీడ్ చూసి టికెట్ మార్కెట్‌లో కూడా కింగ్డమ్ స్పెషల్ పాజిషన్ సంపాదించుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇటీవలి కాలంలో ఎలాంటి ఫ్లాప్‌లు వచ్చినా, ఈ సినిమాకు ముందస్తు బుకింగ్స్, రిలీజ్ రోజు రన్ ఆల్ షోలు హౌస్‌ఫుల్ కావడం ట్రేడ్ వర్గాల్లో హైప్‌ను మరింత పెంచాయి.

టాక్ మిక్స్‌డ్‌ గా ఉన్నప్పటికీ

కింగ్‌డమ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూస్తే, ఎక్కువమంది విజయ్ నటన, విజువల్స్, అనిరుధ్ మ్యూజిక్‌ను ప్రశంసిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంటెన్స్‌గా ఉందని, వెంకీ విలన్‌గా ఆకట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ కథలో కొత్తదనం లేదని, ఎమోషనల్ కనెక్ట్ తక్కువగా ఉందని కొంతమంది పేర్కొంటున్నారు. జెర్సీ సినిమాతో వచ్చిన గౌతమ్ అంచనాలు పూర్తిగా నెరవేరలేదని అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ సినిమా బడ్జెట్, స్టార్ పవర్ వల్ల బుకింగ్స్ ఎక్కడా తగ్గడంలేదు.

‘కింగ్‌డమ్’ ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. యూఎస్, కెనడా వంటి దేశాల్లో ప్రీమియర్ షోలు రికార్డ్ స్థాయిలో నడిచాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మిలియన్ డాలర్ మార్క్ టార్గెట్‌గా పెట్టుకుని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్లే, వసూళ్లు కూడా ఆ రేంజ్‌లోనే వచ్చాయి. ఇండియన్ మార్కెట్‌లోనూ ఇదే స్థాయిలో విజయ్ క్రేజ్ నిలబడిందని స్పష్టమవుతోంది.

బాక్సాఫీస్ వద్ద విజయ్ హవా!

వికెండ్ ప్రారంభానికి ముందు 221K టికెట్లు బుకయ్యాయి అంటేనే ‘కింగ్‌డమ్’కు మొదటి మూడు రోజులు అదిరిపోయే ఓపెనింగ్ దక్కినట్లే. ట్రేడ్ పండితులు ఈ సినిమా తొలి రోజు భారతదేశంలో సాలీడ్ నెట్ కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గతంలో విజయ్ దేవరకొండ బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల రేంజ్ కు తగ్గట్లే కింగ్డమ్ కూడా టాప్ లిస్టులో నిలుస్తుందని ఫిగర్స్ బయటికి వస్తున్నాయి. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయడం, ఇండియాలో రెండు లక్షలపైగా టికెట్లు 24 గంటల్లో అమ్ముడవ్వడం విజయ్ క్రేజ్ మరోసారి చూపించింది.

బిగ్ స్టార్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే రేంజ్‌లో ‘కింగ్డమ్’ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఓవర్సీస్ వసూళ్లు, దేశీయ మార్కెట్‌లో క్రేజీ బుకింగ్స్, పాజిటివ్ టెక్నికల్ టాక్, ఇవన్నీ కలిసొచ్చిన ఈ ప్రాజెక్ట్, విజయ్ దేవరకొండకు తప్పక మంచి బ్రేక్ ఇవ్వబోతోందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి టాక్‌ మిక్స్‌డ్‌ గా ఉన్నా, ‘కింగ్డమ్’ బుకింగ్స్ లో మాత్రం హంగామా తగ్గడం లేదు. ప్రస్తుత ట్రెండ్ చూస్తే, వారం చివరికి ఈ సినిమా ఇండస్ట్రీలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.